లెజెండ్ తరహాలో మరోసారి..!

0
270
Jagapathi Babu Again Legend Villainism In Boyapati Movie

Posted [relativedate]

Jagapathi Babu Again Legend Villainism In Boyapati Movieహీరోగా దాదాపు కెరియర్ ఎండింగ్ కి వచ్చేసిన జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ గా అవతరించాడు. ఇక ఆ దెబ్బతో జగ్గు భాయ్ దశ తిరిగిపోయింది. సినిమాలో ఓ టిపికల్ క్యారక్టర్ ఉంది అంటే దానికి జగపతి బాబుని సెలెక్ట్ చేస్తున్నారు. తెలుగులోనే కాదు తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా జగపతి క్రేజ్ పెరిగిపోయింది. అయితే తనను విలన్ గా మార్చిన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు మళ్లీ విలన్ గా నటిస్తున్నారు. సో మరోసారి లెజెండ్ లాంటి విలనిజం జగ్గుభాయ్ నుండి చూడబోతున్నామన్నమాట. లెజెండ్ సినిమాలో బాలయ్యతో పాటుగా పోటీ పడి నటించిన జగపతి బాబు ఆ తర్వాత విలన్ గానే కాదు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయ్యాడు. ప్రస్తుతం బోయపాటి సినిమాలో కూడా జగపతి బాబు క్యారక్టర్ మళ్లీ ప్రేక్షకులందరు గుర్తుంచుకునేలా తెరకెక్కిస్తున్నారట.

రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మరి లెజెండ్ మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందే లేదో చూడాలి.

Leave a Reply