జగ్గూభాయ్ పటేల్ టీజర్ అదిరింది..

 Posted March 31, 2017

jagapathi babu Patel SIR Movie Teaserజగపతిబాబు.. ఒకప్పుడు కుటుంబకధా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం విలన్ గా, హీరోలకి ఫాదర్ గా  నటిస్తున్నాడు. అయినప్పటికీ సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో ఆ  హీరోలకే పోటీ వచ్చేస్తున్నాడు. లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన  ఈ హోమ్లీ హీరో శ్రీమంతుడు సినిమాలో మహేష్ పాధర్ గా మతిపోగొట్టాడని చెప్పవచ్చు. తాజాగా జగ్గూభాయే హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

వాసు పరిమి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘పటేల్ మూవీలో  జగపతిబాబు హీరోగా  నటిస్తున్నాడు. ఈ సినిమాకు సర్.. ఎస్.ఐ.ఆర్ అనేది ట్యాగ్ లైన్. వారాహి చలన చిత్రం బేనర్ పై సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రంకు శ్యామ్ కె. నాయుడు ఫోటోగ్రఫీ అందించనుండగా, సంగీతం డీజే వసంత్ అందించనున్నాడు. రాజమౌళి తనయుడు కార్తీకేయ ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ గా పని చేయనున్నాడు. తెలిసిన శత్రువులు వందమంది ఉన్నా పర్లేదు కానీ, తెలియని శత్రువు ఒక్కరున్నా ప్రమాదమే….చావే రావచ్చు. అనే పాయింట్ మీద సినిమా సాగనుంది. నిన్న పూజా కార్యక్రమాలు జరిపించిన చిత్రయూనిట్   టీజర్ ని కూడా విడుదల చేసింది. ఇందులో జగపతి బాబు లుక్ ని చూసి అభిమానులు  షాకవుతున్నారు. చాలా గ్రిప్పింగ్ గా ఉన్న ఈ లుక్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. గతంలో కుటుంబకధా చిత్రాలతో పలు హిట్స్ అందుకున్న జగ్గూభాయ్ ఈ యాక్షన్ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. 

SHARE