Posted [relativedate]
ఒకప్పటి కుటుంబకధా చిత్రాల హీరో జగపతిబాబు ప్రస్తుతం విలన్ పాత్రలనే పోషిస్తున్నాడు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల సినిమాల వరకు అందరి సినిమాల్లో ప్రతినాయకుడిగా అలరిస్తున్నాడు. ఒక్క టాలీవుడ్ లోనే కాక కోలీవుడ్, మాలీవుడ్ లలో కూడా నెగెటివ్ పాత్రల్లో దూసుకుపోతున్న జగ్గుభాయ్ కి తాజాగా మరో అవకాశం వచ్చింది.
నిన్న పూజాకార్యక్రమాలు జరుపుకున్న రామ్ చరణ్ కొత్త సినిమాలో జగపతి బాబును విలన్ గా సెలక్ట్ చేసింది చిత్ర యూనిట్. పల్లెటూరి ప్రేమ కథగా తెరకెక్కనున్న ఈ మూవీలో విలన్ పాత్ర కోసం జగపతి బాబే బాగా సరిపోతాడని సుకుమార్ అనుకున్నట్లు తెలుస్తోంది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో జగపతి బాబు చేసిన విలనిజం, ఆ మూవీకి ప్లస్ అవడంతో సెంటిమెంట్ గా మళ్లీ ఈ సినిమాలో కూడా జగపతినే ఫిక్స్ చేశాడట సుకుమార్.