మళ్లీ మల్లన్న సాగర్ అగ్గి ..జగ్గారెడ్డి అరెస్ట్

0
536

  jaggareddy arrest mallanna sagar project issue
మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జగ్గారెడ్డిని సంగారెడ్డికి పీఎస్ కు తరలించారు. కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న గెస్టుహౌజ్ వద్ద ఆయన ఆమరణనిరాహాదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు దీక్ష చేపట్టేందుకు జగ్గారెడ్డి ఐదు వందలమంది కార్యకర్తలతో కొత్త బస్టాండ్ వద్ద ఉన్న గెస్టుహౌజ్ వద్దకు వెలుతున్పుడు పాత బస్టాండ్ సెంటర్ లో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్టు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అనంత కిషన్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

జ‌గ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేయ‌డం ప‌ట్ల కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈరోజు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… జ‌గ్గారెడ్డిని అరెస్టు చేయ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని అన్నారు. ప్రభుత్వం చేప‌ట్టిన ప్రాజెక్టుల‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని ఆయ‌న అన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో దోపిడీ జ‌రుగుతోంద‌ని, దానికి మాత్రమే తాము వ్య‌తిరేక‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేయాల‌ని చూస్తోన్న 123 జీవోను పూర్తిగా ర‌ద్దు చేసేవ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని ఆయ‌న తెలిపారు.

Leave a Reply