జై లవకుశ ఫస్ట్ లుక్ ఇదేనా..?

 Posted February 10, 2017

జనతాగ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ హిట్ తో ఎన్టీఆర్ రేంజ్ పెరిగిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత దాదాపు ఐదు నెలల పాటు కథలు విన్న ఎన్టీఆర్… బాబి చెప్పిన కధ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. జై లవకుశ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. ఈ రోజు పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 15 నుండి రెగ్యులర్ గా జరగనుంది.

కాగా  జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పిక్స్ హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి చిత్రయూనిట్ ఎటువంటి పిక్స్ విడుదల చేయకపోయినా ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారక్టర్స్ ఏంటో తెలియడంతో కొంతమంది అభిమానులు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇదేనంటూ పిక్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ పిక్స్ ఒరిజినల్ కాదని తెలిసినా తెగ షేర్ అవుతుండడం విశేషం.

 

SHARE