ఏపీ కాంగ్రెస్ కోసం జైపాల్?

  jaipal reddy counter undavalli arun kumar book
విభజన కథ డైరీలో నా పేజీలు …అంటూ ఉండవల్లి రాసిన పుస్తకం కాంగ్రెస్ కంట్లో నలుసుగా మారింది.ఆంధ్రాలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఏర్పడింది.దీంతో అప్రమత్తమైన 10 జన్ పద్ …ఉండవల్లికి కౌంటర్ ఇవ్వాల్సిందిగా విభజనలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి ని ఆదేశించినట్టు సమాచారం.దీంతో అయన రంగంలోకి దిగారు.ఉండవల్లివి కట్టుకధలని కొట్టిపారేశారు. స్పీకర్ ఛాంబర్ లోజరిగిన అంశాలపై ఉండవల్లి ఏదేదో ఊహించుకుని అదే రాయడం సరికాదన్నారు.తన సలహా మీదే స్పీకర్ ప్రత్యక్ష ప్రసారాల్ని ఆపి ఉండొచ్చని ఉండవల్లి చెప్పడాన్ని జైపాల్ తప్పుబట్టారు.పెప్పర్ స్ప్రే కొట్టడం వల్లే ప్రసారాలు ఆపి ఉంటారని అయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రావడం జీర్ణించుకోలేకే ఉండవల్లి ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జైపాల్ ఆరోపించారు.

జైపాల్ మాటలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఉండవల్లి పుస్తకంతో తెలంగాణాలో కాంగ్రెస్,జైపాల్ కి క్రెడిట్ వచ్చే అవకాశముంది.దీని వల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అప్రజాస్వామిక వైఖరి గురించి చర్చ,నష్టం తప్పదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది.ఇక ఏపీ లో కాంగ్రెస్ ఎన్నటికీ కోలుకోదు.ఇవన్నీ ఆలోచించుకున్నాకే ఉండవల్లి పుస్తకంతో తెలంగాణ లో వచ్చే లాభం కన్నా అంతటా కలిగే నష్టమే ఎక్కువని కాంగ్రెస్ గ్రహించింది.ఒకప్పుడు విభజనకి హైకమాండ్ ని ఒప్పించి ఆంధ్రా లో కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బ తీసిన జైపాల్ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కోసం కలగచేసుకోవాల్సి రావడం చిత్రమే..

SHARE