జైట్లీ..బాబు ఏమి మాట్లాడారు?
అరగంట ఫోన్ సంభాషణ.. ఆంధ్రుల భవిష్యత్ తేల్చే మాటలవి… కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ… ఏపీ సీఎం చంద్రబాబు ఆ అరగంటలో ఏమి మాట్లాడుకున్నారు? అందరి దృష్టి దానిమీదే. అయితే ఆ మాటలపై ఎవరి భాష్యం వారిది. దేశం అనుకూల వర్గాలు చంద్రబాబు.. జైట్లీని ప్రత్యేక హోదా, ప్యాకేజ్ గురించి గట్టిగా అడిగారని చెప్తున్నారు. అయితే ఒక్కదానికే గతిలేకపోతే రెండింటిపై అడిగారా అని వ్యతిరేకులు ఎగతాళి చేస్తున్నారు. మొత్తానికి జైట్లీ మాటల తరువాత దేశం టోన్ మారినట్టు కన్పిస్తోంది. జైట్లీ … బాబు మధ్య దేనిపై ఒప్పందం కుదిరిందో ? అది ఆ ఇద్దరికే తెలుసు. కానీ ఈ రహస్యం ఎక్కువ కాలం దాగదు. మాట బయటపడకపోయినా.. దాని పర్యవసానాలు, తరువాత ప్రవర్తన ఆ రహస్యాల్ని భూతద్దం లో చూపిస్తాయి.