జైట్లీ నోట చంద్రబాబు పాట ..

jaitley chandra babuప్రత్యేక హోదా అంశంలో రాజ్యసభలో చేసిన ప్రసంగం మీద తీవ్ర విమర్శలు రావడంతో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బాణీ మార్చారు .తరువాత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధాని మోడీ చర్చలు జరిపారు .ఇక అప్పటినుంచి ఈ అంశం గురించి ఎవరడిగినా జైట్లీ సమాధానం ఒక్కటే ..అది ..చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నాం ..త్వరలో తేల్చేస్తాం ..

లోక్ సభలో వైసీపీ ఎంపీల ఆందోళనలు , దేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రస్తావన నేపథ్యంలో జైట్లీ సమాధానం చెప్పారు .సదరు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తున్నామని ,త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు .ఇదంతా చూస్తున్న దేశం ఎంపీ ఒకరికి కొత్త డౌట్ వచ్చింది ….పదేపదే జైట్లీ నోట బాబు మాట వస్తోంది ..హోదా వస్తే సరే లేకుంటే ఆ పాపమంతా బాబు నెత్తిన చుడతారేమోనని ఆ ఎంపీ వాపోతున్నారు .

SHARE