జైట్లీ కూడా ఓ రాయి..

 Posted October 28, 2016

jaitley in base pillar cermony in amaravathiఅమరావతిలో శంకుస్థాపనల ప్రక్రియ మాత్రం జోరుగా సాగుతూనే వుంది.తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి చేతుల మీదుగా కూడా కోర్ కాపిటల్ కోసం ఓ శంకుస్థాపన రాయి పడింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. శుక్రవారం లింగాయపాలెం గ్రామంలో జైట్లీ భూమిపూజ చేసి శిలఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఏపీ పర్యటనలో భాగంగా జైట్లీ  పరిపాలనా భవనాలతో పాటు రూ. 1,016 కోట్లతో నిర్మించే  ఏడు గ్రిడ్ రోడ్లు, రూ. 461 కోట్లతో నిర్మించే స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జైట్లీ పాల్గొన్నారు. బహిరంగ సభ కోసం దాదాపు 100 ఎకరాలలో భూమిని చదును చేసినట్లు అధికారులు తెలిపారు. వీవీఐపీలు రావడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు రూరల్‌ ఎస్పీ నారాయణనాయక్‌ చెప్పారు. ఈ రోజు సాయంత్రం విజయవాడ నుంచి జైట్లీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు.

SHARE