మధ్యప్రదేశ్ సీఎం ఏపీ హోదాకి అడ్డుపడ్డాడా ?

  jaitley said shivraj singh chauhan stopped ap special status
రాజకీయ నష్టాన్ని సైతం లెక్కచేయకుండా ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం ఇంత పట్టు పట్టడం వెనుక కారణం ఏమిటి ? ఈ ప్రశ్న ఎన్నో మెదళ్ళని తొలుస్తోంది.కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తనదగ్గరకొచ్చిన ఏపీ బీజేపీ నేతలకి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.నీతి ఆయోగ్ ..మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసింది.ఈ కమిటీ హోదాల పేరుతో రాష్ట్రాల మధ్య అంతరం తగదని అభిప్రాయపడినట్టు జైట్లీ వివరించారు.11 మంది ముఖ్యమంత్రులతో ఏర్పడిన ఈ కమిటీ సిఫార్సులని పరిగణనలోకి తీసుకొని వచ్చే ఏడాది మార్చి నుంచి ఏ రాష్ట్రానికి హోదా ఉండదని జైట్లీ చెప్పారు.

జైట్లీ వివరణతో ఏపీ బీజేపీ నేతలు సంతృప్తి చెందారట.హోదా ఉద్యమం ఎంత ఊపు అందుకున్నా వచ్చే మార్చి తరువాత పరిస్థితి అందరికీ అర్ధమవుతుందని వాళ్లకి జైట్లీ చెప్పిన మాటలు కొత్త ఉత్సాహానిచ్చాయట .ఇదంతా చూస్తుంటే…మనింట్లో కరెంట్ పోగానే పక్కింట్లోకి చూసి అక్కడా పోయిందిలే అని సరిపెట్టుకుంటున్నట్టు లేదు ?

SHARE