ఆరు నెలల ముందే నోట్ల రద్దు నిర్ణయం…?

Posted November 10, 2016

jaitli and modi secret banమన దేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యనికి గురిచేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎప్పుడు జరిగిందో తెలుసా… దాదాపు ఆర్నెళ్ల కింద ప్రదాని, ఆయన ముఖ్య కార్యదర్శి దీనిపై చర్చింకుని మొదటగా ఆర్బీఐ మాజీ గవర్నర్‌కి చెప్పారట.. ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న ఆర్థికవేత్తల్లో ఒకరైనా మాజీ ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌  కొనసాగకుండా వెళ్లడానికి నోట్ల రద్దే కారణమని కూడా తెలుస్తుంది. ఈ ప్రతిపాదన ఆయనతో చర్చించి ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా కోరారంటా.. అలా ముగ్గిరితో మొదలైన ప్రయాణం ఆర్థిక శాఖతో అవసరం పడి మూడు నెలల క్రితం అరుణ్‌ జైట్లీకి చెప్పారట.. ఆర్థిక శాఖలో చేయాల్సిన పనులకు సంబంధించి సాయం కోరారంటా దానికి జైట్లీ స్పందించి ఇద్దరు నమ్మకస్తులైన సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్లను అప్పగించి.. అలా పది కళ్లకు తప్పా మరో కంటికి తెలియకుండా మొత్తం కథ నడిపించి ఈ భారీ నిర్ణయం ప్రకటించారు. ఈ మొత్తం ప్రక్రియలో ఇక్కడి పరిణామలు గమనించిన రఘురాం రాజన్‌ కొనసాగ కూడదని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది. ఆయన తరవాత ఉర్ధివ్‌సాయంతో మిగిలిన కార్యక్రమం ముగించారు.. దేశాన్నే కుదిపే ఈ సంచలన నిర్ణయాన్ని ఇంత గోప్యంగా నడిపించగలిగారంటే మోదీ దక్షత ఏంటో అర్థం చేసుకోవచ్చు…

SHARE