‘జక్కన్న’ రివ్యూ…

497

jakkanna movie review

చిత్రం : జక్కన్న (2016)
నటీనటులు : సునీల్, మన్నారా చోప్రా, సప్తగిరి, కబీర్ దుల్హన్ సింగ్
సంగీతం : దినేష్
దర్శకుడు : వంశీ కృష్ణ ఆకెళ్ల
నిర్మాత : సుదర్శన్ రెడ్డి, ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి
విడుదల తేదీ : 29 జులై, 2016.

కమెడియన్ నుంచి హీరోగా ప్రమోటైన సునీల్ తాజా చిత్రం “జక్కన్న”. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సునీల్ సరసన మన్నారా చోప్రా జతకట్టింది. ప్రేమ‌క‌థాచిత్ర‌మ్’ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రమిది. సుదర్శన్ రెడ్డి, ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి నిర్మాతలు. ‘మర్యాద రామన్న’ తర్వాత సునీల్ కి ఆ రేంజ్ లో హిట్ పడలేదు. పైగా ఈ మధ్య వరుసగా ప్లాపులు పలకరించాయి. ఇప్పుడు సునీల్ ఆశలన్నీ ‘జక్కన్న’పైనే పెట్టుకొన్నాడు. అందుకే తనకు కొట్టినపిండైన కామెడీనే నమ్ముకొన్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘జక్కన్న’ ఈరోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి.. సునీల్ ‘జక్కన్న’ పేరు నిలబెట్టాడా.. ? జక్కన్నతో ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించగలిగాడు. సునీల్ ఖాతాలో హిట్ప డినట్టేనా.. ?? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి గణేష్ (సునీల్ ). ఇతనికి హెల్ప్ చేసినవారికి తిరిగి హెల్ప్ చేస్తుంటాడు. ఈ క్రమం లో వైజాగ్ సిటీకి డాన్ అయినా భైరాగి , గణేష్ చిన్నతనం లో హెల్ప్ చేస్తాడు. దీంతో అతడిని కలవడానికి వైజాగ్ వెళ్ళతాడు. అతడో పెద్ద రౌడీ అని తెలుసుకొని అతడిని మార్చే ప్రయత్నం చేస్తాడు. ఈ లోపు భైరాగి చెల్లెలు సహస్ర (మన్నారా చోప్రా) గణేష్ ని లవ్ చేయడం మొదలు పెడుతుంది. మరి భైరాగి మారతాడా..? సహస్ర ప్రేమకు ఒకే చెపుతాడా ..? అనేది మిగతా స్టోరీ.

కథ :
గణేష్ (సునీల్).. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎవరైనా తనకు సాయం చేస్తే.. వారికి జీవితాంతం సాయం చేసే మనస్తత్వం గుణేష్ ది. అలాంటి గణేష్ కి చిన్నప్పుడు అనుకోకుండా సాయం చేస్తాడు భైరాగి (కబీర్ సింగ్). బైరాగీ వైజాకి పెద్ద రౌడీ. అయినా ఇవేవీ పట్టించుకోకుండా భైరాగీ దగ్గరికెళ్లిన గణేష్.. భైరాగీని మార్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో భైరాగీ చెల్లెలు సహస్ర (మన్నారా చోప్రా) ప్రేమలో పడతాడు. చివరికి.. భైరాగీ మారాడా.. ? గణేష్ – సహస్త్ర లవ్ స్టోరీ ఏమైంది.. ?? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* సునీల్
* సప్తగిరి & పృధ్వీ కామెడీ ట్రాక్
* క్లైమాక్స్
* స్ర్కీన్ ప్లే

మైనస్ పాయింట్స్ :
 * స్లో నేరేషన్
*  ఊహించే కథ (Predictable story)

పెర్ ఫామెన్స్ :
సినిమా టైటిల్ ‘జక్కన్న’.. కంప్లీట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్..  హీరో సునీల్. ఇక్కడి వరకు బాగానే ఉంది. దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ల అనగానే ఎక్కడో డౌట్ కొట్టింది. ఈ చిత్రం ప్రారంభం కాగానే అందరూ దర్శకుడు ఆకెళ్లపై కాస్త డౌట్ పడ్డారు. ఎందుకంటే.. ‘రక్ష’తో భయపెట్టిన చరిత్ర ఆకెళ్లది. అలాంటి ఆకెళ్ల ట్రాక్ మార్చి సునీల్ ని పెట్టి కామెడీ చేస్తానంటే ఎవ్వరికైనా డౌట్ కొట్టిద్ది. కానీ, వంశీ కృష్ణ మాత్రం కామెడీ చేయించడంలోనూ డిస్టెక్షన్ లో పాసయ్యాడు. సునీల్ కరెక్ట్ గా వాడుకొన్నాడు. కథకి సునీల్ మార్క్ కామెడీని యాడ్ చేయడంలోనూ సఫలీకృతమయ్యాడు. ఇక, సునీల్ ఎప్పటిలాగే ఇరగదీశాడు. పాత సునీల్ ని చూపించేశాడు. కామెడీతో పాటు డ్యాన్సులు భలే చేశాడు. హీరోయిన్ మన్నారా చోప్రా చూడ్డానికి బాగానే కనిపించింది. కానీ.. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో బాగా బాగుపడాలి. సునీల్ తర్వాత ఈ చిత్రానికి మరో ఎసెట్ సప్తగిరి-30ఇయర్స్ కామెడీ ట్రాక్. వీళ్లు తెరపై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. ఇక, మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక విభాగం :
దర్శకుడు వంశీకృష్ణ కామెడీ పంచ్ లతో ఆకట్టుకొన్నాడు. ప్రేక్షకుడు తెరపై తర్వాత ఏం జరగబోతుందో ముందే తెలిసిపోతుంది. అయినా తన కూల్ స్క్రీన్ ప్లే తో మాయ చేశాడు దర్శకుడు. సంగీతం కూడా కూల్ గానే ఉంది. నేపథ్య సంగీతం మరింత బాగా ఇవ్వొచ్చేమో. ఫోటోగ్రఫీ బాగుంది. జక్కన్నకి మరింత కత్తెరపెట్టడంలో ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. కొన్ని కామెడీ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. మొత్తానికి  జక్కన్న సాంకేతికంగానూ రిచ్ గా ఉన్నాడు. నిర్మాణ విలువలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఈ విషయంలో నిర్మాతలని మెచ్చుకోవాల్సిందే.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
ఈ మధ్య ప్రేక్షకుడిని హాయిగా నవ్వించే సినిమాలే కరువయ్యాయి. ఈ కరువులోనూ సునీల్ క్లీన్ కామెడీతో వచ్చేశాడు. లాజిక్కులు, మేజిక్కులు పట్టించుకోకుండా.. ఓ రెండున్నర గంటలపాటు హాయిగా గడిచిపోవాలంటే సునీల్ ‘జక్కన్న’ థియేటర్ కి వెళ్లొచ్చు. ఇక, సునీల్ మార్క్ కామెడీని ఎంజాయ్ ప్రేక్షకులు మాత్రం మరింత ఫాస్ట్ గా జక్కన థియేటర్ లో వాలిపోవడం మంచింది.

బాటమ్ లైన్ : ఎంటర్ టైనింగ్.. జక్కన్న
రేటింగ్ : 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here