క్యాబినెట్ ఉబలాటం..ముందే మిఠాయిలు పంపకం..

 jaleel khan spreading sweets people cabinet minister post purpose
రాష్ట్ర క్యాబినెట్ లో చోటు ఆ ఎమ్మెల్యే చిరకాల వాంఛ.దానికోసం అటుఇటు పార్టీలు కూడా మారారు.కానీ అదృష్టం దక్కలేదు.వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచినా మళ్లీ ఫలితం లేకపోవడం ఆయన్ను ఆలోచనలో పడేసింది.ఆపరేషన్ ఆకర్ష్ మొదలు కావడంతో అయన అధికార పార్టీలోకి జంప్ అయ్యారు.అప్పుడే తనకు క్యాబినెట్ హామీ వచ్చిందని అయన చెప్తున్నారు.చెప్పడమే కాదు మంత్రి అయినట్టే మాట్లాడుతున్న అయన మరెవరో కాదు జలీల్ ఖాన్ .

మైనారిటీ కోటాలో తనకి క్యాబినెట్ లో స్థానం ఖాయమని జలీల్ విశ్వాసం.అయినా అధినేత మనసు చూరగొనడానికి జగన్ మీద అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతుంటారు.ఇటీవల విజయవాడలో మైనారిటీలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.అదే వేదికపై జలీల్ మాటలు బాబుని డిఫెన్స్ లో పడేశాయి.

ఇంతకీ ఆయనేమన్నారంటే …మైనారిటీలకు ఏదో ఒక మంత్రి పదవి కాదు సార్ ..మంచి పోర్ట్ ఫోలియో ఇవ్వాలని అడిగారు.ఎలా స్పందించాలో అర్ధం కానీ బాబు నవ్వి ఊరుకున్నారు.ఇప్పుడు పుష్కర సందర్భంగా అనుచరులతో కలిసి మిఠాయిలు పంచుతూ కనిపిస్తున్నారు.ఈయన గారి క్యాబినెట్ ఉబలాటం తెలిసిన వాళ్ళు మంత్రి పదవి రాకముందే మిఠాయిలు పంచుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.

SHARE