Posted [relativedate]
బీకామ్ లో ఫిజిక్స్ చదివానంటూ ఏకంగా మంత్రిపదవి కోల్పోయిన జలీల్ ఖాన్ మళ్లీ పప్పులో కాలేసాడు.లేనిపోని ఇంటర్వ్యూ లతో తమ పదవి పోయిందని తెలిసి కూడా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.అంతే కాదు ఆ ఇంటర్వ్యూ లో మెట్రిక్యూలేషన్ లో ఎంపీసీ గ్రూప్ తీసుకున్నానని చెప్పాడు. అయితే యాంకర్ ముఖ కవళికలు పసిగట్టి వెంటనే చేసిన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసాడు.అక్కడా మళ్లీ తప్పు చేసాడు.పీయూసీ లో ఎంపీసీ గ్రూప్ చదివానని చెప్పాడు.ఇక లాభం లేదనుకుని ఎప్పుడో 30 ఏళ్ళనాడు చదువు ఇప్పుడు ఎలా గుర్తుంటుందని ఎదురు ప్రశ్నించాడు. తనని ఇబ్బంది పెడుతున్న విలేకరుల్ని ప్రజాసమస్యలపై దృష్టి పెట్టమని సూచించాడు.
బీకామ్ ఫిజిక్స్ అంటూ జలీల్ ఖాన్ ని అసెంబ్లీ వేదికగా ఓ ఆట ఆడుకున్న వైసీపీ అధినేత జగన్ ని కూడా ఖాన్ గేమ్ ఆడేసేందుకు ట్రై చేసాడు.ఓ సందర్భంలో జగన్ రెండు ఇరవై ఎనిమిదులు అరవై నాలుగు అని చెప్పలేదా అని ఖాన్ గారి ప్రశ్న.ఓ సంఖ్యని రెండుతో హెచ్చించడం తెలియని జగన్ గురించి ఎందుకు నిలదీయరని ఖాన్ భాయ్ డౌట్.ఏదేమైనా సోషల్ మీడియా లో బీకామ్ ఫిజిక్స్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన జలీల్ ఖాన్ ఇప్పుడు సీక్వెల్ అన్నట్టు మెట్రిక్ ఎంపీసీ,జగన్ లెక్కలు వదిలాడు.ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి.