Monday, September 26, 2022
Homelatestట్రంప్ తలదించుకునే టైం వచ్చింది.

ట్రంప్ తలదించుకునే టైం వచ్చింది.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అద్యక్ష పీఠం ఎక్కిన దగ్గర నుంచి డోనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా తన విధానాలతో సృష్టిస్తున్న కలకలం చూస్తూనే వున్నాం. ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు.. మరెందరో ఉద్యోగాలు పోతాయని భయపడుతూ బతుకుతున్నారు. ఇంకెందరో అమెరికా వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇన్ని జరుగుతున్నా తన విధానాల్లో ఏ తప్పు లేదని వాదిస్తూ వస్తున్నారు. తల ఎగరేస్తున్నారు. కానీ ఇన్నాళ్ళకి ట్రంప్ తల దించుకుని సంజాయిషీ ఇవ్వాల్సిన రోజు కూడా వచ్చేసింది.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడానికి రష్యా సాయం చేసిందని అప్పట్లో పెద్ద ప్రచారమే సాగింది. అందులో నిజం వున్నా లేకున్నా మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్ కి రష్యా తో వున్న సంబంధాల గురించి వ్యవహారం విచారణ దాకా వచ్చింది. ఆ దర్యాప్తుని ఆపమని fbi మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమి మీద ట్రంప్ ఒత్తిడి తెచ్చిన విషయం బయటికి వచ్చింది. ఈ విషయాన్ని కోమి స్వయంగా సెనెట్ నిఘా వ్యవహారాల కమిటీకి వాంగ్మూలం ఇచ్చారు. గత జనవరి 27 న వైట్ హౌస్ గ్రీన్ రూమ్ లో జరిగిన డిన్నర్ పార్టీ లో ప్రైవేట్ సంభాషణల్లో ట్రంప్ ఈ విషయం ప్రస్తావించినట్టు కోమి వివరించారు. సెనెట్ కమిటీ ఆ వాంగ్మూలం విషయాన్ని బయటపెట్టడంతో అమెరికాలో కలకలం రేగింది. ట్రంప్ వైఖరిని తప్పుబడుతూ డెమొక్రాట్లు విమర్శలు చేస్తున్నారు. అటు సగటు అమెరికన్ కూడా అధ్యక్షుడి తీరుని తప్పుబడుతున్నారు. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో అర్ధం కాకుండా వుంది.

మరో వైపు ట్రంప్ విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం కుదేలు అవుతోంది. అయితే ఆ విషయాన్ని బయటికి చెప్పడానికి సదరు సంస్థలు మొహమాటపడుతున్నాయి. ఆ మొహమాటాన్ని పక్కనబెట్టి విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ ముందుకొచ్చారు. ట్రంప్ విధానాలవల్ల ఐటీ రంగం దెబ్బ తింటోందని విప్రో తో ఓ బహిరంగ ప్రకటన ఇప్పించారు. తమ కంపెనీ ఏ విధంగా నష్టపోతుందో అందులో వివరించారు. విప్రో బాటలో మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా నడిచే అవకాశం వుంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్త నోరుద్యోగ సమస్యకు ట్రంప్ జవాబుదారీ కావాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి కి అటు రాజకీయంగా ఒత్తిడి మొదలైతే ట్రంప్ తలదించుకోక తప్పదు.

- Advertisment -
spot_img

Most Popular