జెంటిల్ నేత జానా.

0
467

  jana reddy gentil political man
రాజనీతి కాస్తా రాజకీయం మాత్రమే అయ్యాక హుందాతనం అన్న మాట కాగడా కాదు ఫోకస్ లైట్స్ వేసి వెదికినా కానరాని పరిస్థితి.ఇటు అధికారం లో వున్నా అటు ప్రతిపక్షం లోవున్నా రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడ్డం,వారితో ఆటాడ్డం సర్వసాధారణమైపోయింది.విషయం ఏదైనా ఎదుటివారిలో తప్పులు మాత్రమే వెదికే పరిస్థితి కనిపిస్తోంది.అందుకు భిన్నంగా వ్యవహరిస్తే అయినవాళ్లు ఇంత మెతగ్గా వుండొద్దంటారు.హైకమాండ్ పోరాడడం లేదు అంటుంది.సొంత పార్టీ వాళ్ళు స్వార్ధపరుడంటారు.ఎదుటి పార్టీ వాళ్ళు లెక్కచేయరు.ఇలాంటి పరిస్థితుల్ని కొన్నాళ్లుగా ఎదుర్కొంటూనే వున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత ..మాజీ హోమ్ శాఖ మంత్రి జానారెడ్డి .

అధికార టీయారెస్ మీద పార్టీలోని నేతలంతా విరుచుకు పడుతుంటే …ఒక్క జానా మాత్రం అంశాలవారీగానే మాట్లాడుతున్నారు.ఒక దశలో అయన అధికార పక్షానికి భయపడుతున్నారా అన్న సందేహాలు చాలా మంది వెలిబుచ్చారు.మొన్న పుష్కర ఏర్పాట్లు బాగున్నాయంటూ అయన చేసిన వ్యాఖ్యలు హస్తం నేతలకు రుచించలేదు.అయితే అంతలోనే ప్రాజెక్ట్ లపై మహా ఒప్పందం అంశం వివాదాస్పదమైంది.ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే జైలు కి వెళతారంటూ సీఎం కెసిఆర్ చేసిన హెచ్చరికల మీద జానా మాట్లాడతారని ఎక్కువమంది భావించలేదు.

కానీ ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ జానా కెసిఆర్ కు ధీటుగా కౌంటర్ ఇచ్చారు.సీఎం అయ్యాక ఉద్యమస్థాయి నేతగా మాట్లాడ్డం తగదన్నారు.బెదిరింపులు ప్రజాస్వామ్యం లో పనిచేయవని సూటిగా కెసిఆర్ కి చెప్పారు. మొత్తానికి రాజకీయ ప్రత్యర్థుల మీద ఎప్పుడైనా విమర్శలు మాత్రమే చేసే ట్రెండ్ కి జానా బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నారు.అవసరాన్ని బట్టి అంశాలవారీగా స్పందిస్తున్నారు .హుందాతనం మర్చిపోయిన నేటితరం రాజకీయాల్లో జెంటిల్ నేతగా నిలుస్తున్నారు.

Leave a Reply