Posted [relativedate]
సాధారణంగా ప్రతిపక్ష నాయకుడంటే ప్రభుత్వాన్నిచెడుగుడు ఆడాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ తప్పొప్పులను ఎత్తి చూపాలి. కానీ తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి రూటే సపరేటు.ఆయన మాట తీరు కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎక్కువ వేదాంత ధోరణిలోనే ఆయన మాట్లాడతారు. తెలంగాణ అసెంబ్లీలో హాట్ హాట్ వాతావరణం ఉన్న తరుణంలో… బయటికొచ్చి మరోసారి అదే వేదాంతం చెప్పుకొచ్చారు జానారెడ్డి.
జానారెడ్డి తనను మహాభారతంలోని ధర్మరాజుతో పోల్చుకున్నారు. తమ ఎమ్మెల్యేలు భీముడు, అర్జునుడిగా చెప్పుకొచ్చారు. తాము పాండవుల్లా ఉన్నామంటూ తాము వెనకబడిపోతున్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. తన స్థాయికి దిగజారి మాట్లాడలేనని చెప్పుకొచ్చారు.
జానా మాట్లాడిన మాటలకు సొంత పార్టీ నుంచే అప్పుడే కౌంటర్లు పడుతున్నాయని టాక్. వయస్సు, అనుభవం రీత్యా…ఆయనే సీనియర్ కాబట్టి… కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనకు ఎదురు మాట్లాడకుండా నడుచుకుంటారు. లోపల అసంతృప్తి ఉన్నా జానా చెప్పింది వింటారు. అసెంబ్లీలో జానా వల్లే వెనకబడిపోతున్నామని ఆఫ్ ది రికార్డు చెప్పే ఎమ్మెల్యేలు కూడా ఎక్కువే. ప్రభుత్వంపై పోరు చేయాల్సిన సమయంలో ఈ వేదాంతం ఏంటని మండిపోతున్నారట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.