Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా డిమాండ్ తో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుంటూరు లో జరిపిన సభకు మద్దతు ఇవ్వడం ద్వారా జనసేన అధినేత రాజకీయంగా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు.అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కి మద్దతు ఏంటని విమర్శలు వచ్చినా ఈ ఒక్క నిర్ణయంతో పవన్ కి ఎన్నో విధాలుగా మేలు జరిగే అవకాశాలు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ కి భారీ షాక్ తగలబోతోంది.కాంగ్రెస్ సభకు జనసేన మద్దతు తర్వాత ప్రత్యేక హోదా అంశం మీద ఇక ఈ ఇద్దరిలో ఎవరికి హక్కు ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు.అటు వైసీపీ మాత్రం అప్పుడప్పుడు ప్రత్యేక హోదా అంటున్నా ఆ మాట ఆంధ్రప్రదేశ్ జనానికి మాత్రం వినపడి బీజేపీకి,కేంద్రానికి వినపడకుండా జాగ్రత్తపడుతోంది.అంతకు ముందేమో గానీ ప్రధాని మోడీతో భేటీ తర్వాత వైసీపీ లో వచ్చిన మార్పు జనానికి బాగానే అర్ధం అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఆదినుంచి కాంగ్రెస్ కి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా వున్న ఎస్సీలు,మైనారిటీలు రాష్ట్ర విభజన తర్వాత పూర్తి స్థాయిలో వైసీపీ ని ఆశ్రయించారు. మోడీతో జగన్ భేటీ తర్వాత వారి ఆలోచనల్లో కూడా తేడా వచ్చింది.ఏదో ఒక ప్రత్యామ్న్యాయం చూసుకోవాలని ఎక్కువమంది భావిస్తున్నారు.కానీ వారికి సరైన దారి దొరకలేదు.కాంగ్రెస్ కి పవన్ మద్దతు తర్వాత జనసేన రూపంలో వారికి ఓ అవకాశం కనిపిస్తోంది.ఇక హోదా విషయంలో తాము ఏమి చేసినా అడిగే దిక్కు లేదని బీజేపీ భావించింది.విభజన పాపం మోస్తున్న కాంగ్రెస్ ఎన్ని చెప్పినా ఆ పార్టీని ఏపీ ప్రజలు నమ్మబోరని బీజేపీ భావించింది.కానీ ఇప్పుడు కాంగ్రెస్ కి జనసేన తోడైతే అన్న ఆలోచన బీజేపీ కి ఎంతోకొంత ఒత్తిడి తప్పదు.ఇక ప్యాకేజ్ తో ఎలాగోలా వచ్చే ఎన్నికలు గట్టెక్కిద్దామని భావిస్తున్న చంద్రబాబుకి కూడా తాజా పరిణామం కూడా పెద్ద షాక్.కానీ అందరికన్నా భారీ షాక్ మాత్రం జగన్ కే.పవన్ నిర్ణయంతో ఆయనకు ప్రత్యేక హోదా అంశం మీద పట్టు చేజారుతుంది.ఇక ఎస్సీ,మైనారిటీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ లేదా పవన్ వైపు చూసే అవకాశాలు లేకపోలేదు.పైగా గుంటూరు సభలో హోదా విషయంలోచంద్రబాబు,జగన్ ని ఒకే గాటన కట్టి మాట్లాడారు రాహుల్. ఆ విధంగా చూస్తే జాతీయ స్థాయిలో జగన్ ఇటు బీజేపీ,అటు కాంగ్రెస్ ఎవరికీ కాకుండా పోయారు.ఒకే ఒక్క రాజకీయ నిర్ణయంతో పవన్ ఇన్ని విధాలుగా జగన్ ని డిఫెన్స్ లో పడేసారు. తాజా సంగతులు తెలుసుకున్న జగన్ న్యూజిలాండ్ టూర్ లో ఏమి ఎంజాయ్ చేయగలరు పాపం,బేజారు కావడం తప్ప.