జనసేన సర్వే తో జగన్ బెంబేలు?

0
593
janasena survey shocking news

Posted [relativedate]

janasena survey shocking news
2014 ఎన్నికలు అయిపోయిన 6 నెలల నుంచి ఎప్పటికప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే గెలుపు వైసీపీదేనని జగన్ ఎన్నోసార్లు చెప్పారు.మనమంతా విన్నాం.మరో ఏడాదిలో మన ప్రభుత్వం,కాబోయే సీఎం నేనే లాంటి మాటలు తరచుగా జగన్ ప్రయోగిస్తుంటారు.అది ఆయన నమ్మకమో ,అభద్రతో తెలియదు.కానీ పదేపదే ఎన్నికల ప్రస్తావన తేకుండా అయన ఉండలేరు. ఇప్పుడు అదే పని ఇంకో పార్టీ చేస్తే మాత్రం జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. 2019 ఎన్నికల బరిలోకి దిగడానికి డిసైడ్ అయిపోయిన జనసేన ఇటీవల ఓ సర్వే నిర్వహించిందట.ఆ సర్వే ఫలితాలు జనసేనతో పాటు జగన్ ని కూడా షాక్ కి గురి చేశాయంట.ఆ సర్వే ప్రధాన ఉద్దేశం ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏపీ లో ఎవరికెన్ని సీట్లు వస్తాయి అన్నది తెలుసుకోవడమే..

జనసేన నిర్వహించిన సర్వే లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ కి 71 ,జనసేనకు 65 ,వైసీపీ కి 39 స్థానాలు వస్తాయని తేలిందట.అంతటి సానుకూల ఫలితాలు ఊహించని జనసేన కూడా సర్వే రిజల్ట్ తో షాక్ అయ్యిందట.పార్టీ నిర్మాణం,అభ్యర్థుల ఎంపిక బాగా ఉంటే ఇంకొన్ని స్థానాలు సాధించగలమని జనసేన అంచనా వేస్తోందట.అయితే జగన్ మాత్రం ఈ సర్వే ఫలితాల గురించి తెలుసుకుని కాసేపు బెంబేలెత్తి ఆపై ఈ సర్వే జరిగింది నిజమేనా అని డౌట్ వ్యక్తపరిచారంట. లేని సర్వే ఉన్నట్టు తనని కంగారుపెట్టొద్దని విషయం మోసుకొచ్చిన సన్నిహితులతో చెప్పారట.పైగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని డంకా భజాయించి చెప్పారట.ఆ ఎపిసోడ్ అయిపోయాక ఇంకో నేతని పిలిచి ఆ జనసేన సర్వే వివరాలు సమగ్రంగా కనుక్కోమని ఆదేశించారట. ఔను మరి ..రాజకీయాల్లో ఓటమిని అంగీకరించడం కన్నా ఆ భయం లేకుండా ముందుకెళ్లడం చాలా కష్టం.

Leave a Reply