జనతా గ్యారేజ్ ఓ లవ్ స్టోరీ..

 janata garage love story
ఎన్టీఆర్ మాయచేశాడు.పెళ్ళైపిల్లాడు పుట్టాక లవ్ స్టోరీలు చేయలేనన్నాడు.ఎంత మాయ ..ఎంత అబద్ధం..జనతా గ్యారేజ్ ఓ స్వచ్ఛమైన ప్రేమకథే..అది ప్రకృతి,పురుషుడి ప్రేమకథ..ప్రకృతి తత్వాన్ని పుణికిపుచ్చుకున్న స్త్రీత్వాన్ని అమ్మగా,చెల్లిగా,ప్రియురాలిగా ,భార్యగా …పురుషుడు ప్రేమిస్తాడు ..ఆరాధిస్తాడు..అయితే భావ వ్యక్తీకరణలోనే బలహీనుడు పురుషుడు.కానీ ఆ బలహీనతని అధిగమించిన ఓ సంపూర్ణ పురుషుడు…స్త్రీత్వానికి ఆదిబిందువైన ప్రకృతిని ప్రేమిస్తే..ఆ ప్రకృతికి కష్టమొస్తే ఈ పురుషుడి కళ్ళలో నీళ్లు తిరగవా? అంతలోనే నిప్పులు కురవ్వా? బిగికౌగిలిలో ఇమిడిపోయే ప్రియురాలి కోసమే ప్రాణాలర్పించే ప్రేముంటే…ఒళ్ళంతా కళ్ళే చేసుకున్నా తనివితీరని అందాలు ..చూపుకందని చిత్రాలు ..మనోభావాలకు అందని మర్మాలు తనలో దాచుకున్న ప్రకృతినే ప్రియురాలిగా తీసుకుంటే …ఆ పురుషుడిలో వెల్లువెత్తే ప్రేమ లోతును కొలవగలమా ?ప్రియురాలి కష్టాన్ని తీర్చడానికి చెలరేగిపోయే వీరత్వాన్ని అంచనా వేయగలమా ?

ప్రకృతి ప్రేమే కాదు ..అందులో భాగమైన భూమి వుంది..ఆ భూమిపై నీలాంటి ..నాలాంటి మనుషులున్నారని …వారికీ భాధలున్నాయని …ఆ బాధ్యత తీసుకోమని ఓ పెద్దాయన చెప్పే జీవిత పాఠం ఓ మంత్రమైతే …ప్రియురాలిలో భాగమైన ప్రతి అణువు స్వచ్ఛముగా,పవిత్రంగా వుండాలని పరితపించే పురుషుడు ఆ ప్రకృతికి ఆయుధమైతే ..ఆ ఆయుధమే ఎన్టీఆర్ అయితే …చూడ్డానికి కళ్ళు ,స్పందించడానికి మనసు సరిపోవు ..అందుకే ఆ అపురూప ప్రేమకధ ని మనకి అర్ధమయ్యే,మన కళ్ళు చూడగలిగే ,హృదయం స్పందించగలిగే స్థాయికి తెచ్చాడు కొరటాల.వెండితెరపై మరో ప్రకృతి,పురుషుడి ప్రేమని ఆవిష్కరించాడు.ఆ కధలోహృదయం,మేధ ల సమన్వయంతో సాగే ప్రేమ ఎలా ఉంటుందో చూడొచ్చు…మనసారా అనుభూతులు నింపుకొని ఇంటికెళ్లొచ్చు..ఇన్ని ఒప్పుకున్నా ఎన్టీఆర్ మీద మా అభ్యంతరం అలాగే వుంది..మా ప్రశ్న మిగిలే వుంది…ప్రేమ కధలు చేయనని అబద్ధమెందుకు చెప్పావ్?మమ్మల్నెదుకు మాయ చేసావ్ ?

SHARE