జ‌న‌తా గ్యారేజ్‌ ప్రివ్యూ…

 janata garage movie preview

చిత్రం : జ‌న‌తా గ్యారేజ్‌
న‌టీన‌టులు : జూ.ఎన్టీఆర్‌, మోహ‌న్‌ లాల్, స‌మంత‌, నిత్యామీన‌న్‌, ఉన్ని ముకుంద‌న్‌
సంగీతం : దేవిశ్రీప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం : కొర‌టాల శివ‌
నిర్మాత :  మోహ‌న్ చెరుకూరి, న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌
రిలీజ్ డేట్‌ : సెప్టెంబ‌ర్‌ 1

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దమ్మున్న కథానాయకుడు. సరైన కథ పడాలే గానీ..ఇండస్ట్రీ రికార్డులన్నీ ఉఫ్ అని ఊదేయగల సత్తా ఉన్నోడు. పైగా ఇప్పుడు మాంఛి ఫాంలో ఉన్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టాడు. హ్యాట్రిక్ హిట్ కోసం తాజా చిత్రం “జనతా గ్యారేజ్”తో మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సరైన కథ పడితే ఇండస్ట్రీ రికార్డులన్నీ తిరిగరాసే రకం.. తారక్. అయితే, అలాంటి కథని అందించే సత్తా ఉన్న దర్శకుడు కొరటాల శివ. ఇప్పటికే మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా ఎదిగాడు. అంతేకాదు.. కమర్షియల్ చిత్రాలకి కొత్త పంథా చూపించాడు. ఓ సామాజిక అంశానికి కమర్షియల్ కోటింగ్ ఇవ్వడం కొరటాల స్పెషాలిటీ. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’ విషయంలోనూ ఇదే ఫాలో అయ్యాడు కొరటాల. పర్యావరణ సంరక్షణ అనే పాయింట్ ని కథలో అంతర్గతంగా ప్రస్తావిస్తూ దాన్ని చూట్టూ మానవీయ విలువలతో కూడిన కమర్షియల్ కోటింగ్ ఇచ్చాడు. కొరటాల కలం నుంచి వచ్చిన బలమైన కథకి.. ఎన్టీఆర్ అద్భుతమైన నటన తోడవ్వడంతో హిట్ గ్యారేంటీ అని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. అదెంత వరకు నిజమన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఈలోపు.. జనతా గ్యారేజ్ విశేషాలపై ఓ లుక్కేద్దాం.. పదండీ..

కొరటా శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు జతకట్టనున్నారు. కాజల్ ‘పక్కా లోకల్..’ ఐటమ్ సాంగ్ లో
మెరవనుంది. మళయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో.. కేరళ ‘జనతా గ్యారేజ్’పై కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
పైగా ‘ఓనం పండగ’ సీజన్ లో రిలీజ్ కానున్న చిత్రం కావడం కేరళ గ్యారేజ్ కి కలిసొచ్చే అంశం. మరో మళయాళ నటుడు ఉన్ని ముకుందన్ విలన్ గా
కనిపించనున్నారు. ఇక, దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే పల్లె-పట్టణాల్లోనూ మారు మ్రోగుతున్నాయ్. వినాయక చవితి రానుండటంతో గల్లి గల్లీలోనూ గ్యారేజ్ పాటల గోల వినపడటం ఖాయం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

ఇక, “జనతా గ్యారేజ్” కథ విషయానికొస్తే.. ఒకరు భూమిని ప్రేమిస్తారు, మరొకరు భూమ్మీద మనుషులను ప్రేమిస్తారు. వాళ్లిద్దరు కలిసి ఎలాంటి మార్పు
తీసుకొచ్చారన్నది ‘జనతా గ్యారేజ్‌’ మూల కథ. ఇందులో ఎన్టీఆర్ పర్యావరణ ప్రేమికుడిగా.. మోహన్ లాల్ మనుషుల్లో మార్పు కోసం తాపత్రయ పడే వారిగా
కనిపించనున్నారు. ప్రకృతి, పర్యావరణ ప్రేమించే వారు.. వాటి (చెట్టు, నీళ్లు, ఆకాశం)లాగే నిర్మలంగా సహజంగా ఉండాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కూడా
నిర్మలంగా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ మేకోవర్‌, స్టైల్స్‌ అన్నీ పాత్రకు తగినట్లు ఉంటాయి.

మోహన్‌లాల్‌.. మనుషులను ప్రేమించే మంచి మనిషిగా కనిపించనున్నారు. అయితే, ఎన్టీఆర్-మోహన్ లాల్ ని కథలో కనెక్ట్ చేసే విధాన్ని అద్భుతంగా
తీర్చిదిద్దాడట కొరటాల. ఎన్టీఆర్ ఐఐటీ స్టూడెంట్, ప్రకృతి ప్రేమికుడు. అలాంటోడు.. ‘జనతా గ్యారేజ్’లో రిపేర్లు చేసుకొంటూ.. మ‌నుషుల్ని ప్రేమించాల‌ని చెబుతుండే మోహన్ లాల్ ని కలుస్తాడట. గ్యారేజ్ కి తనవంతు హెల్ప్ చేస్తూ ఉండే ఎన్ టీఆర్ కి తన తండ్రి మర్డర్ గురించి తెలుస్తుందట. అదీ కూడా మోహన్ లాల్ తో లింకుందని తేలియడం షాక్. ఇక, హీరోయిన్స్ సమంత, నిత్యామీనన్ ల పాత్రలకి నటనని ప్రదర్శించే స్కోప్ ఉందట. ప్రత్యేకంగా నిత్యమీనన్ కార్యేక్టర్ కథని మలుపు తిప్పుతుందని చెబుతున్నారు. ఇక, విలన్ ఉన్ని ముకుందన్ గురించి ఎలాంటి లీకులు ఇవ్వకున్నా.. ఎన్ టీఆర్ తో ఢీ అంటే ఢీ అనే పాత్ర అని చెబుతున్నారు.

అస్సలు నిజమేంటీ ? అని ఆరా తీసే లోపే మోహన్ లాల్ చనిపోవడం.. అది చేసింది ఎన్ టీఆర్ అనే మోహన్ లాల్ తనయుడు ఉన్ని ముకుందన్ భావించడంతో కథ మరింత ఆసక్తిగా మారుతుందట. ఈ తరుణంలో మోహన్ లాల్ ఎలా చనిపోయారు.. ? తన తండ్రిని మర్డర్ చేసిన వారెవరు… ?? దీనికి తోడు.. జనతా గ్యారేజ్ బాధ్యతలని ఎన్ టీఆర్ భుజాలపైకి ఎత్తుకోవడం సినిమాలో కనిపించే హైలైట్ విషయాలు చెబుతున్నారు.

మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న జనతా గ్యారేజ్ పై ప్రేక్షకుల్లో విపరీమైన అంచనాలున్నాయి. ఎన్టీఆర్ ఇరగదీయడం గ్యారేంటీ.. అయితే, ఎన్టీఆర్ ని కొరటాల చూపించే విధానం ఎలా ఉందో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ‘జనతా గ్యారేజ్’ గ్యారెంటీగా హిట్ చిత్రంగా నిలవనుందని చెబుతున్నారు. మరీ.. ఇదెంత వరకు నిజమన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.

జనతా గ్యారేజ్ లైవ్ అప్ డేట్స్, పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి.. మీ తెలుగుబుల్లెట్.కామ్ .

SHARE