జ‌న‌తా గ్యారేజ్‌ రివ్యూ…

823
Spread the love

janata-review

చిత్రం : జ‌న‌తా గ్యారేజ్‌
న‌టీన‌టులు : జూ.ఎన్టీఆర్‌, మోహ‌న్‌ లాల్, స‌మంత‌, నిత్యామీన‌న్‌, ఉన్ని ముకుంద‌న్‌
సంగీతం : దేవిశ్రీప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం : కొర‌టాల శివ‌
నిర్మాత :  మోహ‌న్ చెరుకూరి, న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌
రిలీజ్ డేట్‌ : సెప్టెంబ‌ర్‌ 1

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే.. ఓ పండగలా భావిస్తారు నందమూరి అభిమానులు. ఇక, మాస్ ప్రేక్షకులు విందు భోజనం ఖాయమని డిసైడ్ అయిపోతారు. ఒక్క ఎన్టీఆర్ ఉంటేనే అంచనాలు ఆకాశనంటుతాయి. ఈసారి ఎన్టీఆర్ కి తోడూ మరో పెద్ద టైగర్ మళయాళ స్టార్ మోహన్ లాల్ జత కలిశాడు. పైగా దర్శకుడు కొరటాల శివ. ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ టేస్ట్ తప్ప మరొకటి తెలియని దర్శకుడు. అలాంటి దర్శకుడు టైగర్స్ ఇద్దరిని “జనతా గ్యారేజ్” లోకి తీసుకెళ్లాడు. వీళ్లతో అన్ని రకాల రిపేర్లు చేయించాడు. రిలీజ్ కి ముందే రికార్డుల రిపేర్ కూడా అని ప్రేక్షకులతో అనిపించేశాడు. ఎన్టీఆర్ ఖాతాలో
‘సింహాద్రి’ని మించిన బ్లాక్ బస్టర్ హిట్ పడిపోవడం ఖాయమన్నారు. స్వయంగా కొరటాలనే ఈ కామెంట్ చేయడంతో నందమూరి అభిమానులు గ్యారేజ్ గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ అని డిసైడ్ అయిపోయారు. అయితే, ఇదంతా ‘జనతా గ్యారేజ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చే ముందు వరకు  వినిపించిన కామెంట్స్. ఇప్పుడు గ్యారేజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బెనిఫిట్, ప్రీమియర్ షోలు పడిపోయాయి. జనాలు ‘జనతా గ్యారేజ్’ అద్భుతాలని చూసేశారు. మరి.. చిత్రం
రిలీజ్ ముందు గ్యారేజ్ చిత్రబృందం చెప్పిన మాటలు నిజమయ్యాయా.. ? గ్యారేజ్ పై ప్రేక్షకు పెట్టుకొన్న అంచనాలు ఏ మేరకు నిజమయ్యాయి… ?? అస్సలు ‘జనతా గ్యారేజ్’ కథేంటీ తెలుసుకునేందుకు.. రివ్యూలోకి వెళదాం పదండీ…

కథ :
సత్యం (మోహన్ లాల్).. పల్లెటూరులో ఓ మెకానిక్. తమ్ముడి కోరిక మేరకు మెకానిక్ షాప్ ని హైదరాబాద్ కి షిప్ట్ చేస్తాడు. ఆ షాపే.. “జనతా గ్యారేజ్”. గ్యారేజ్‌ లోపల వెహికల్ రిపేర్ వర్క్స్ చేస్తూ.. బయట మాత్రం మనుషులను రిపేర్ ( పేద‌ల‌పై జ‌రిగే అన్యాయాల‌ను ఎదుర్కొంటుంటారు) చేస్తూ ఉంటారు. దీంతో.. తక్కువ కాలంలోనే జ‌న‌తా గ్యారేజ్ ప్ర‌జ‌ల‌కు దగ్గరవుతుంది. ఆనంద్‌ (ఎన్టీఆర్‌) ముంబైలోఎన్విరాన్‌మెంట్ స్టూడెంట్. ముంబైలో జ‌రిగే గొడ‌వ కార‌ణంగా ఆనంద్ హైద‌రాబాద్ చేరుకుని అక్క‌డ కూడా ప్ర‌కృతికి విరుద్ధంగా ప్ర‌వర్తించే స‌త్యం త‌న‌యుడు రాఘ‌వ‌ (ఉన్ని ముకుందన్)పై ఎదురుతిరుగుతాడు. సత్యం నిర్వహిస్తున్న జనతా గ్యారేజ్ లో ఆనంద్ భాగమైపోతాడు. అసలు ఆనంద్ ఎవరు ? ‘జనతా గ్యారేజ్’లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు. ??  సమంతా, నిత్యామీనన్‌ లతో లవ్ స్టోరీ. మనుషుల సమస్యలని రిపేర్ చేయడానికి సత్యం, ఆనంద్ ఎదుర్కొన్న సమస్యలేంటి.. ? అనేవి మిగతా కథ.

ప్ల‌స్ పాయింట్స్ :
* ఎన్టీఆర్, మోహన్ లాల్
* సినిమాటోగ్ర‌ఫీ
* పాటలు
* రాజీవ్ క‌న‌కాల స‌న్నివేశం
* కాజల్ ఐటెం సాంగ్

మైన‌స్ పాయింట్స్
* కథనం
* కామెడీ
* స్లో నేరేషన్
* ఎడిటింగ్
* కథానాయికలు

నటీనటుల  ఫర్ ఫామెన్స్ : సాధాసీదా కథ అయినప్పుడు కథనం అద్భుతంగా ఉండాలి. అప్పుడే సినిమా కొద్దిలో కొద్దిగానైనా నిలబడుతుంది. అదే అద్భుతమైన కథ ఉన్నప్పుడు కథనంలో కొద్దిగా లోపాలున్న నెట్టుకురావచ్చు. అయితే, “జనతా గ్యారేజ్” కథని అద్భుతం అని భావించిన దర్శకుడు కొరటాల శివ కథనాన్ని వదిలేశాడు. ఫలితంగా.. బ్లాక్ బస్టర్ హిట్ కాస్త హిట్.. యావరేజ్ తో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది. జనతా గ్యారేజ్ చుట్టూ అల్లుకొన్న ఎలిమిట్స్ బాగున్నాయి. అయితే, కథనంలో పెద్దగా ఎఫెక్ట్ కనబడకపోవడంతో సాదాసీదా సినిమాగా అనిపించింది. ఫస్ట్ టైం కొరటాల భంగపడ్డాడు. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనుకున్న కథని తన చేసిన చిన్న చిన్న లోపాలవల్ల హిట్ తో సరిపెట్టుకొన్నాడు. అలాగాని జనతా గ్యారేజ్ బాగలేదని కాదు. గ్యారేజ్ బాగానే ఉంది. కానీ, దర్శకుడు కథనం, కామెడీ సన్నివేశాలపై ఇంకాస్త దృష్టి సారిస్తే.. రిజల్ట్ ఇంకో రేంజ్ లో ఉండేది. ఎన్ టీఆర్ స్టామినా ని వాడుకోవడంలో కొరటాల ఫెయిల్ అయ్యాడు. కానీ.. ఎన్టీఆర్ మాత్రం ఫెయిల్ కాలేదు. ఎప్పటిలాగే అద్భుతమైన నటనతో ఆకట్టుకొన్నాడు. ఎమోషనల్ సీన్స్ లో ఇరగదీశాడు. డ్యాన్సులు, డైలాగ్ ల్లోనూ తనదైన మార్క్ చూపించారు.

ఈ సినిమాకి ఎన్టీఆర్, మోహన్ లాల్ రెండు ధ్వజ స్తంబాల్లా నిలబడ్డారు. మోహన్ లాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని సన్నివేశాల్లో ఆయన కళ్లతో పలికించిన ఎక్స్ ప్రెషన్స్ అదుర్స్. ఎమోషనల్ సీన్స్ లో మోహన్ లాల్ నటన అద్భుతం. వీరికి తోడు మెకానిక్ బ్యాచ్ నటన చాలా బాగుంది. హీరోయిన్స్
సమంత, నిత్యామీనన్ లకి నటనలో పెద్దగా స్కోప్ లేదు. సమంత గ్లామరంతా ఏమైందో అర్థం కావడం లేదు. తన పాత్ర బాగుంటేనే సినిమాని ఒప్పుకునే నిత్యామీనన్ గ్యారేజ్ లో ఏం చూసి ఒప్పుకుందో అర్థం కావడం లేదు. కాకపోతే.. వారికి ఇచ్చిన సీన్స్ చాలా బాగా చేశారు.

గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ సినిమాఫోటోగ్రఫర్ తిరు గురించి అందరూ చెబుతుంటే.. కాస్త అతి చేస్తున్నారేమో అనిపించింది. కానీ.. తిరు టాలెంట్ ఏంటో సినిమా
చూసిన తరువాత తెలిసిందే. ఫోటోగ్రఫీ సూపర్భ్. దేవీ అందించిన పాటలు బాగున్నాయి. తెరపై ఇంకా బాగున్నాయి. ‘ప్ర‌ణామం…’, ‘దివి నుండి దిగి
వ‌చ్చావా.. ‘  ‘పక్కా లోకల్..’ సాంగ్స్ చాలా బాగున్నాయ్. అయితే, నేపథ్య సంగీతం ఇంకా బాగా ఇవ్వొచ్చేమో అనిపించింది. స్లో నేరేషన్ సినిమా ఫలితాన్ని కాస్త దెబ్బతీసింది. ఇంకాస్త కత్తెర పెట్టి సినిమాని పరుగులు పెట్టిస్తే ఇంకా బాగుండేది. కొరటాల కామెడీ చేయించడంలో వీక్. గ్యారేజ్ లోనూ అది మిస్సయ్యింది. దీంతో.. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులు బోర్ గా ఫీలయ్యే ఛాన్సుంది.

సాంకేతిక విభాగం :
దర్శకుడు కొరటాల ‘జనతా గ్యారేజ్’ కథని బాగానే రాసుకొన్న.. కథనంలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి. సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషలను చాలా బాగా డీల్ చేశాడు. కొరటాల రాసుకొన్న డైలాగ్స్ బాగానే పేలాయ్. ముందుగా చెప్పినట్టుగా ఫొటోగ్రఫి అద్భుతంగా ఉంది. మార్తాండ్ ఎడిటింగ్ విష‌యంలో కేర్ తీసుకుని వ్య‌వ‌థి ఇంకాస్తా త‌గ్గించి ఉంటే బావుండేది. దేవిశ్రీ ప్ర‌సాద్ ట్యూన్స్ ప‌రావాలేద‌నిపించినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకోలేదు. విజువల్ ఎఫెక్ట్స్ సాదాసీదాగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

తెలుగు బుల్లెట్ అనాలసిసి :
జనతా గ్యారేజ్.. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. కథనంలో కాస్త రిపేర్ చేస్తే జనతా గ్యారేజ్ జనాల గుండెల్లో మిగిలిపోయే సినిమాగా నిలిచిపోవడం ఖాయం. కాస్త కొత్తదనం, ఎన్ టీఆర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు అర్జెంటుగా గ్యారేజ్ లోకి అడుగుపెట్టాల్సిందే. మిగితా వారు కాస్త ఆలస్యమైన గ్యారేజ్ రిపేర్లను చూడాల్సిందే. మొత్తానికి.. ఎన్ టీఆర్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడినట్టే.

బాటమ్ లైన : ‘జనతా గ్యారేజ్.. జనాల గుండెల్లో’ నిలిచిపోయే సినిమా

రేటింగ్స్ : 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here