జనతా గ్యారేజ్ రెండ్రోజుల్లో 40 కోట్లు పైమాటే..

 janata garage movie second day collections

జనతా గ్యారేజ్ పై వచ్చిన మిక్సిడ్ టాక్ కలెక్షన్ల సునామి ఊడ్చిపారేస్తోంది.. రివ్యూ లు రాసే వాళ్ళ సంగతేమోగానీ సామాన్య ప్రేక్షకుడు, ఎన్టీఆర్ అభిమానులు జనతా గ్యారేజ్ ను సూపర్ డూపర్ హిట్ దిశగా నడిపిస్తున్నారు.. తొలిరోజు వసూళ్లకు ధీటుగా రెండో రోజు కూడా జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది.. సమ్మె ప్రభావం కూడా యంగ్ టైగర్  ముందు చిన్న బోయింది.

తొలిరోజు లెక్కలన్నీ తెలిసేసరికి 27 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెండో రోజు కూడా దాదాపు 16 కోట్లు పైగా జనతా గ్యారేజ్ వసూలు చేసింది. శని,ఆదివారాలు, వినాయకచవితి .. వరుసగా ఇంకా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో తొలివారంలోనే జనతా గ్యారేజ్ 60 కోట్లు దాటే అవకాశం కన్పిస్తోంది.. బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎన్నాళ్ళుగానో ఎదురుచూసిన యంగ్ టైగర్ కలెక్షన్ల ఆకలిని జనతా గ్యారేజ్ తీర్చేస్తోంది. ఈ సినిమా 100 కోట్లు పైగా కలెక్ట్ చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు ఢంకా బజాయిచిం చెపుతున్నారు..

Leave a Reply