జనతా గ్యారేజ్ కెరీర్ బెస్ట్ ఎవరికి.?

0
597

 janata garage movie who person career best

జనతా గ్యారేజ్ వసూళ్ల ప్రభంజనాన్ని ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ వెరైటీగా చెప్పాడు.. సామాన్య ప్రేక్షకులకు, అభిమానులకు ఒకే సినిమా నచ్చడం చాలా అరుదుగా ఉంటుందని, అలాంటి చిత్రంగా జనతా గ్యారేజ్ ని శివ అభివర్ణించాడు..ఓ క్లాసిక్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఆశ్చర్య పరుస్తోందని శివ అన్నాడు.. తన కెరీర్ బెస్ట్ సినిమా జనతా గ్యారేజ్ అని శివ తేల్చేశాడు.. ఇండస్ట్రీ నుంచి ఇన్ని అభినందనలు ఎప్పుడూ అందుకోలేదని చెప్పాడు…

శివ సంతోషం ఇలా ఉంటే పైకి చెప్పకపోయినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జనతా గ్యారేజ్ తన కెరీర్ బెస్ట్ మూవీ గా భావిస్తున్నారట.. ఫలితంతో సంబంధం లేకుండా ఈ  సినిమా,కాన్సెప్ట్ ను ఎన్టీఆర్ అంతగా ప్రేమించాడు.. మొదట్లో రివ్యూ లు కాస్త అటు ఇటుగా వచ్చినా పట్టించుకోలేదు. చివరకు అయన నమ్మకమే నిజమవుతోంది… సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కి ఆ స్థాయిభారీ హిట్ జనతా గ్యారేజ్ తో వచ్చినట్లే కన్పిస్తోంది. ఎవరికైనా సందేహాలుంటే బాక్సాఫీస్ కలెక్షన్ల సునామి చూడగానే అవి తీరిపోవడం ఖాయం..

దర్శకుడు , హీరో .. ఇలా హ్యాపీ అనుకుంటే ఈ సినిమా గొప్ప నటుడు.. జాతీయ స్థాయి కథానాయకుడు మోహన్ లాల్ కెరీర్ లో కూడా బెస్ట్, కేరళలో మూవీ కలెక్షన్లు, ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ చూశాక స్వయంగా ఈ విషయాన్ని మోహన్ లాల్ డైరెక్టర్ కొరటాలతో చెప్పారు..జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ కావడమే ముగ్గురు సినీ దిగ్గజాల కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిందంటే … ఈ సినిమాని వాళ్ళు ఎంతగా నమ్మి చేశారో అర్ధం అవుతోంది.. ఆ నమ్మకాన్ని నిజం చేసిన ప్రేక్షకులకు జనతా గ్యారేజ్ త్రిమూర్తులు థాంక్స్ చెప్పుకొంటున్నారు..

Leave a Reply