గ్యారేజ్ 4 రేటింగ్ అయితే ఫ్లాపే అంటారా..!

janata garage rating 4 movie flop

జనతా గ్యారేజ్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడటం జరిగింది. మరి అక్కడ టాక్ ఎలా ఉందో ఏమోగాని స్టార్ సినిమాలకు ముందుగా రేటింగ్ ఇచ్చే ఉమైర్ సంధు మాత్రం జనతా గ్యారేజ్ కు 4 రేటింగ్ ఇచ్చాడు. ఉమర్ సంధు 4/5 ఇచ్చాడంటే ఇక సినిమా ఫ్లాప్ అనేస్తున్నారు కొందరు.

ఎందుకంటే మనోడు 4 రేటింగ్ ఇచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయ్యాయి. అదే దారిలో కబాలి, మోహెంజోదారో కూడా సంధు ఇచ్చిన రేటింగ్ కు సినిమా రిజల్ట్ కు సంబంధం లేకుండా పోయింది. ఇక జనతా గ్యారేజ్ విషయంలో కూడా ఉమైర్ సంధు ఇచ్చిన 4 రేటింగ్ ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. యూకె, యూఏఇలో సినిమా మేగజైన్ రన్ చేస్తున్న సంధు ప్రతి స్టార్ సినిమాకు ముందుగా రేటింగ్ ఇచ్చి ఓ రకంగా సినిమాకు ఇంకాస్త హైప్ క్రియేట్ చేస్తున్నాడు. తీరా సినిమా చూస్తే మాత్రం అంతా తేడా కొట్టేస్తుంది. మరి జనతా గ్యారేజ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

SHARE