50 కోట్ల క్లబ్ దాటిన జనతా గ్యారేజ్

janatha garage 50 million clubజనతా గ్యారేజ్ కలెక్టన్స్ లో మరో మైలురాయి దాటింది .సునాయాసంగా మూడంటే మూడు రోజుల్లో 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది .సరైన సినిమా పడితే యంగ్ టైగర్ రేంజ్ ఎలా ఉంటుందో జనతా గ్యారేజ్ చూపిస్తోంది .బహుశా దశాబ్ద కాలం తర్వాత నేను కొట్టబోయే భారీ హిట్ ఇదేనేమో అంటూ ఆడియో రిలీజ్ టైం లో ఎన్టీఆర్ చెప్పిన మాటలు అక్షరాలా నిజమవుతున్నాయి .ఒక్క అమెరికాలోనే మూడు రోజుల్లో మిలియన్ మార్క్ ని ఎన్టీఆర్ దాటేశాడు .సినీ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చెప్తున్నలెక్కల ప్రకారం యుఎస్ లో జనతా గ్యారేజ్ మూడు రోజుల్లో దాదాపు 6 కోట్ల34 లక్షలు  కలెక్ట్ చేసింది .అయితే ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కధనం ప్రకారం దక్షిణ భారతంలో తొలి మూడు రోజుల కలెక్షన్ విషయంలో బాహుబలి ,కబాలి తర్వాత స్థానం గ్యారేజ్ దేనని తేల్చింది .ఈవారాంతం లోపే డిస్ట్రిబ్యూటర్స్ లాభాల బాటలో పడతారు.ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం నాలుగో రోజు కూడా కలెక్షన్స్ స్టడీ గా వున్నాయి .

SHARE