జనతా గ్యారేజ్ ఆడియో విడుదల..

   janatha garage audio release

యంగ్ఎ టైగర్ ఎన్టీఆర్‌, సమంత, నిత్యామీనన్‌ హీరో హీరోయిన్లుగా, మోహన్ లాల్ ప్రధాన పాత్ర లో  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘జనతాగ్యారేజ్‌’. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్‌ సంగీతంలో రూపొందిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌, చిత్ర దర్శకుడు కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్‌, నిత్యామీనన్‌, సాయికుమార్‌, ఉన్ని ముకుందన్‌, సుకుమార్‌ , శ్రీనివాస్‌, అజయ్‌, బ్రహ్మాజీ, రాజీవ్‌ కనకాల, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, ప్రసాద్‌ వి.పొట్లూరి, దిల్‌రాజు,వక్కంతం వంశీ, సినిమాటోగ్రాపర్‌ తిరు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

SHARE