జనతా గ్యారేజ్ కలెక్షన్ల సునామీ

janatha garage collectionsజనతా గ్యారేజ్ భారీ హిట్ కావడమే కాదు ..ఆ సినిమాతో సంబంధమున్న ప్రతి ఒక్కరు భారీ లాభాలు తీసుకోబోతున్నారు .45 కోట్ల బడ్జెట్ తో చేసిన జనతా గ్యారేజ్ ని దాదాపు 70 కోట్ల రూపాయలకి నిర్మాతలు అమ్ముకున్నారు .టేబుల్ ప్రాఫిట్ గా విడుదలైన గ్యారేజ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ లు ఫలితం గురించి కొంత కంగారుపడ్డ విషయం తెలిసిందే .కానీ వాళ్ళ అంచనాలు తప్పాయి .వాళ్ళు ఊహించనంత స్థాయిలో కలెక్షన్ల సునామీ ముంచెత్తింది .

తొలి మూడు రోజుల్లో 50 కోట్ల మార్క్ దాటిన జనతా గ్యారేజ్ 4 వ రోజు కూడా అదే దూకుడు కొనసాగించింది .ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ అమౌంట్ లో తెలుగు రాష్ట్రాల్లో కొల్లగొట్టిన 6 కోట్ల నెట్ కూడా వుంది .మొత్తం నాలుగు రోజుల్లో 87 కోట్ల గ్రాస్ సాధించింది.వెబ్ సైట్ రివ్యూ లు సరిగ్గా లేకపోయినా వాటి మీద ఆధారపడి సినిమాలకి వెళ్లే ఓవర్సీస్ ,నగరాల్లోనూ కలెక్షన్స్ చూసి మతులు పోతున్నాయి ఇటీవల కొన్నివెబ్ సైట్ లు ఫలితాన్ని తారుమారు చేయగలమని విర్రవీగాయి.సినిమా కంటెంట్ ,మౌత్ టాక్ ముందు ….ముఖ్యంగా మంచి సినిమా పడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ముందు ఇవేమీ పని పనిచేయవని తేలిపోయింది.

SHARE