100 కోట్ల గ్రాస్ తో జనతా గ్యారేజ్ ..

  janatha garage 100 crores gross
జనతా గ్యారేజ్ మరో రికార్డు ని రిపేరు చేసింది.100 కోట్లు గ్రాస్ దాటేసింది.ఈ ప్రయాణాన్ని వేగంగా పూర్తి చేసిన రెండో తెలుగు చిత్రంగా నిలిచింది.బాహుబలి తర్వాత అత్యంత వేగంగా 100 కోట్ల మైలురాయి చేరింది .తొలి వారంలో 79 కోట్ల షేర్ జనతా గ్యారేజ్ సొంతమైంది .ఇదే దూకుడు మరి కొన్ని రోజులు కనబరిస్తే 100 కోట్ల షేర్ కూడా యంగ్ టైగర్ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తోంది.

మిక్స్డ్ టాక్ ,బాడ్ రివ్యూస్ ఇవేమీ గ్యారేజ్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయాయి .మౌత్ టాక్ ముందు ..సామాన్య ప్రేక్షకుల ఆదరణ ముందు …ప్రతికూల ప్రభావాలన్నీ ఎన్టీఆర్ సునామీలో కొట్టుకుపోయాయి .

జనతా గ్యారేజ్ తొలివారంలో ఆంధ్ర ,తెలంగాణ కలిపి 51 కోట్లు,కర్ణాటకలో 10.5 కోట్లు,అమెరికాలో 9.5 కోట్లు కలెక్ట్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా మిగిలిన చోట్ల 8 కోట్లు సాధించింది.డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికే లాభాల బాట పట్టారు .

SHARE