జనతా ఎఫెక్ట్ టికెట్లు రేట్లు పెంచేశారు

janatha garage effect ticket price raised

సినిమా భారీ కలక్షన్స్ సాధించాలనే ఉద్దేశంతో స్టార్ సినిమా అంటే టికెట్ల రేటు పెంచేయడం మాములే. అయితే ఇప్పటిదాకా మేజర్ సిటీస్ లోనే ఉండే ఈ ఆనవాయితి ఇప్పుడు అన్ని పట్టణాలకు పాకింది. రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న జనతా గ్యారేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అన్ని సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల టికెట్ల రేటు పెంచేశాడట. దీని తాలుఖు పర్మిషన్స్ కూడా తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. మొన్నటిదాకా 70 రూపాయలున్న సింగిల్ స్క్రీన్ టికెట్ వెల ఇప్పుడు 100 రూపాయలు చేశారట.

అయితే ఈ పెరిగిన టికెట్ రేటు కేవలం వారం రోజులు మాత్రమే అట. తర్వాత మళ్లీ తగ్గించేస్తారని అంటున్నారు.. ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ ఎలాగైనా సంచలన రికార్డులు సృష్టించాలని ఇలా సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లు పెంచడం జరిగింది. మరి ఈ ఐడియా నిర్మాతలకొచ్చిందా లేక డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుదా తెలియదు.. తారక్ సినిమా కాబట్టి టికెట్ రేటు ఎంత అయినా సరే ముందు సినిమా చూడాలనే ఊపుమీదున్నారు అభిమానులు. ఇకనుండి ప్రతి పెద్ద సినిమాకు ఇదే రేంజ్లో ఓ వారం పాటు టికెట్ రేటు పెంచే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

SHARE