75 కోట్ల వద్ద జనతా గ్యారేజ్..

  janatha garage got 75 crores share

జనతా గ్యారేజ్ కలెక్షన్ల పరంగా మరో మైలు రాయికి చేరువలోవుంది.రెండో వారం ముగిసేసరికి దాదాపు 75 కోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన సెలవులు,వారాంతాలు గ్యారేజ్ విజయంలో కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి.రిలీజ్ అయిన వెంటనే వినాయక చవితి వల్ల లాంగ్ వీకెండ్ తొలివారం ప్రభంజనానినికి బాగా ఉపయోగపడింది.ఆంధ్ర ప్రాంతంలో హోదా డిమాండ్ తో వైసీపీ నిర్వహించిన బంద్ రోజు కలెక్షన్లు బాగా వచ్చాయి.బక్రీద్ సెలవు,భాగ్యనగరంలో నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 15 న ఇచ్చిన సెలవు కూడా గ్యారేజ్ కలెక్షన్స్ డ్రాప్ కాకుండా పనికొచ్చాయి.దీంతో రెండు వారాలు పూర్తి అయ్యేసరికి జనతా గ్యారేజ్ షేర్ 75 కోట్ల మార్క్ ని అందుకుంటుంది.

SHARE