షాకింగ్ : జనతా గ్యారేజ్ హీరో ఎన్టీఆర్ కాదట

0
1210
janatha garage hero

janatha garage hero

ముందునుండి అనుకున్నట్టుగానే జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ తాను హీరోని కాదు అని చెప్పేశాడు. అయితే సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్న మోహన్ లాల్ హీరోనా ఏంటి అంటే.. కాదు ఆయన కూడా కాదు జనతా గ్యారేజ్ సినిమాలో ఆ గ్యారేజే హీరో. కొరటాల శివ రాసిన కథే తనని, మోహన్ లాల్ గారిని ఎంచుకుంది తప్ప ఇందులో మేమెవ్వరం హీరోలం కాదు అనేశాడు. అంతేకాదు కొరటాల శివ రాసిన ఈ కథ గొప్పది కాబట్టి ఆయన విల్ పవర్ ను బట్టి మేమందరం ఈ సినిమాకు పనిచేయడం జరిగిందని అన్నారు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన తారక్ సినిమా గురించి చాలా విషయాలు ఆడియెన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇక మోహన్ లాల్ గారితో నటించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఆయన నట ప్రస్థానం గురించి మాట్లాడే స్థాయి తనకు లేదు కాని ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే సెట్ లో చిన్న కుర్చి వేసినా సంతోషంగా కూర్చునే వ్యక్తి ఆయన. ప్రతి విషయంలో ఆనందాన్ని వెతుక్కోవడం తన పని.. అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడం తన అదృష్టమని తారక్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply