చీకట్లో ఎన్టీఆర్ ఐటెం ..

 janatha garage movie ntr kajal item song night‘జనతా గ్యారేజ్’ సినిమా టాకీ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించి ఒక ఐటమ్ సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఆ పాట చిత్రీకరణలో టీమ్ నిమగ్నమై ఉంది. హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో మూడు రోజులుగా ఈ పాటను షూట్ చేస్తున్నారు. ఈ పాట చిత్రీకరణలో ఎన్టీఆర్ – కాజల్ తో పాటు, బ్రహ్మాజీ .. బెనర్జీ తదితరులు కూడా పాల్గొంటున్నారు.

సందర్భానికి తగినట్టుగా ‘ధాబా’ సెట్ వేయించి, రాత్రివేళల్లో మాత్రమే షూటింగ్ చేస్తున్నారు. రేపటితో ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ పూర్తికానుంది. ఈ ఐటమ్ సాంగ్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవడం ఖాయమని చెబుతున్నారు. ఈ సినిమా విడుదలయ్యే సెప్టెంబర్ 2వ తేదీ కోసం, ఎన్టీఆర్-కొరటాల అభిమానులతో పాటూ సినీప్రియులూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

SHARE