Posted [relativedate]
జయలలిత 2015 జూన్ వరకు తనకు రూ.117.13 కోట్ల ఆస్తులున్నట్టు చెప్పారు.2015 లో రామకృష్ణ నగర్ ఉప ఎన్నికల సందర్భం గా వెల్లడించిన వివరాల ప్రకారం ….
**చెన్నై లోని పోయెస్ గార్డెన్ లోని జయలలితకు నివాస గృహం ‘వేద విలాస్’ ఉంది. 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం రూ.43.96 కోట్ల విలువ చేస్తుంది.ఈ ప్రాపర్టీని జయలలిత తల్లి సంధ్య 1967లో కొనుగోలు చేశారు. ఆమె కొనుగోలు చేసిన సమయంలో ఈ గృహం విలు రూ.1.32 లక్షలు.
* జయలలితకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని జయలలిత 1968లో తన తల్లి సంధ్యతో కలిసి కొనుగోలు చేశారు.
* తమిళనాడులోని కాంచీపురంలో 3.43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని 1981లో కొనుగోలు చేశారు.
* జయలలితకు ఉన్న నాలుగు వాణిజ్య భవనాల్లో ఒకటి హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఉంది. రిపోర్టుల ప్రకారం ఈ భవనాల్లో ఒక ప్రాపర్టీని జయలలిత దత్తత తీసుకున్న శశికళ అన్న కుమారుడు వీఎన్ సుధాకర్ సొంతం కానుంది.
* జయలలితకు ఉన్న వివిధ కంపెనీలకు చెందిన కార్లు మొత్తం తొమ్మిది ఉన్నాయి. వీటి ఖరీదు రూ.42,25,000
**జయలలిత వద్ద 21280.300 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ విషయాన్ని జయలలిత గతంలో ప్రకటించారు. అయితే, అక్రమాస్తుల కేసుల్లో ఈ ఆభరణాలు ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నాయి. అంతేగాక, రూ.3,12,50,000 విలువ కలిగిన 1,250 కేజీల వెండి జయలలిత దగ్గర ఉంది.
* ఆమె స్థిర, చరాస్తుల విషయానికి వస్తే.. గత ఎన్నికల సమయంలో ఆమె తెలిపిన వివరాల ప్రకారం చరాస్తులుగా రూ.41.63 కోట్లు, స్థిరాస్తులుగా రూ.72.09 కోట్లున్నాయి.
* వివిధ కంపెనీల్లో ఆమె పెట్టుబడులు, షేర్లను పోలీసులు సీజ్ చేశారు. పార్టనర్ గా ఆమె ఐదు సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల విలువ రూ.27.44 కోట్లుగా ఉంది. ఆమె వ్యక్తిగత రుణాలు, అడ్వాన్స్ లు ఎవరికీ, ఏ సంస్థకీ ఇవ్వలేదని ఆమె అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు వీటికి వారసులు ఎవరనేది ప్రశ్న …
* ఇక 2015-16 ఏడాదికి సంబంధించిన ఆదాయపన్ను రిటర్న్ లను ఆమె దాఖలు చేశారు. 2013-14లో ట్యాక్స్ చెల్లింపులన్నీ పూర్తిచేశారు. ఆమె చివరగా ఇచ్చిన వివరాల్లో ఆమె వద్ద రూ.41,000 నగదు, రూ.2.04 కోట్ల ఆస్తిపాస్తులున్నట్టు పేర్కొన్నారు.