జయ ఆరోగ్యంపై వీడని సస్పెన్స్ ..

jaya health suspense
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. ఇంచార్జి గవర్నర్ విద్యాసాగరరావు రాకతో అయినా ఓ స్పష్టత వస్తుందని అంతా భావించారు .అయితే అయన అపోలో ఆస్పత్రికి వచ్చి ఎవరితో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆ తరువాత రాజ్ భవన్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది.జయ ని చూశానని, ఆమె వేగంగా కోలుకుంటున్నారని ఆ ప్రకటనలో పేర్కొనడంతో మళ్లీ విషయం అక్కడికే చేరింది.ఇప్పటిదాకా అన్నాడీఎంకే వర్గాలు చెప్తున్న మాటనే గవర్నర్ పునరుద్ఘాటించారు.
అపోలోఆసుపత్రిలోకి జయని పరామర్శించడానికి మంత్రులకి కూడా అనుమతి దొరకడం లేదు.
కేవలం జయ కోటరీలో కీలకంగా ఉన్న శశికళ,ఆర్ధిక మంత్రి పన్నీరుసెల్వం,సీఎస్ రామ్మోహన్ రావు లాంటి అతి కొద్ది మంది మాత్రమే జయ ఉన్న గది దగ్గరకి వెళ్లగలుగుతున్నారు.

SHARE