తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ..శశికళ అనే పేరున్న వాళ్ళకి మధ్య విచిత్రబంధమేదో ఉన్నట్టుంది .ఓ పక్క నెయ్యం ..మరో పక్క కయ్యం..తప్పడం లేదు.జయ తన నెచ్చెలి శశికళ తోను ఇదే అనుభవం చూశారు. ఓ దశలో తనను చంపడానికి శశి ప్రయత్నిచినట్టు కూడా జయ డౌట్ పడ్డారట .అందుకే ఆమెను పోయెస్ గార్డెన్ నుంచి జయ పంపేశారు. ఆ వైరం ఎక్కువ కాలం కొనసాగలేదు.శశి అభ్యర్థనకు జయ కరిగిపోయారు.ఆమెకు మళ్లీ పోయెస్ గార్డెన్ లోకి అనుమతించారు.ఇప్పుడు అక్కడ శశి కీ మెంబర్.
ఇప్పుడు జయ మీద ఆరోపణలు గుప్పించిన అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ పేరు కూడా శశికళపుష్ప ..ఓ సాధారణ కార్యకర్తగా వున్న ఆమెను జయ రాజ్యసభకు పంపారు.ఆ కృతజ్ఞతతో ఆమె జయను విమర్శించిన సాటి డీఎంకే ఎంపీ మీదే చేయిచేసుకొనే సాహసానికి దిగారు.జయ మెప్పు కోసం చేసిన పని ముప్పు తెచ్చింది.అది కూడా జయ వల్లేనని రాజ్యసభ వేదికగా శశికళ కన్నీరు పెట్టుకున్నారు.తాను కొట్టిన ఎంపీకి సారీ చెప్పి..జయ చేసుకున్నారని శశి ఆరోపించారు.మరో నాలుగేళ్ళున్న రాజ్యసభ కోసమే ఆమె ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నాడీఎంకే వర్గాల ఆరోపణ .ఏమైనా అంతలోనే నెయ్యం..అంతలోనే కయ్యం ..జయ,శశి లది విచిత్రబంధమే కదా