అమ్మ లేచింది..అమ్మలకి వరమిచ్చింది.

Posted November 9, 2016

jayalalitha maternity leave extends to 9 months
తమిళనాట అమ్మ ఆరోగ్యం గురించి రోజుకో వార్త బయటికొస్తోంది.తాజాగా తెలిసిన విషయమేంటంటే ఆమె ఆస్పత్రిలో లేచి నిలబడ్డారట.పోయెస్ గార్డెన్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసి తీసుకెళ్తున్న ఆహారం తీసుకుంటున్నారట.ఈ విశేషాలు బయటికి రాగానే అన్నాడీఎంకే శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.అమ్మ ఆరోగ్యం గురించి సానుకూల వార్తలు బయటికి వస్తున్న తరుణంలోనే కొత్త అమ్మలకి సంతోషకరమైన వార్త వినిపించింది జయ సర్కార్.

అమ్మలకి ఇచ్చే ప్రసూతి సెలవలు 9 నెలలకి పెంచుతూ జయ సర్కార్ జీవో విడుదల చేసింది.ఈ తొమ్మిది నెలల కాలాన్ని ప్రసవం ముందు,తరువాత కలిపి వాడుకునే వెసులుబాటు కూడా కల్పించారు.గత ఎన్నికల సమయంలో జయ మ్యానిఫెస్టోలో చేర్చిన ఈ అంశం మీద ఇప్పుడు అధికారిక ముద్ర పడింది.అయితే ఇద్దరు పిల్లలు కనడానికి మాత్రమే ఈ సెలవలు వర్తిస్తాయి.అంతకు మించి అయితే ఈ సెలవలకి అవకాశం ఉండదు.

SHARE