డాక్టర్ తో జయ డిష్యుం డిష్యుం

Posted December 9, 2016

jayalalitha doctor richard beale between fight in apollo hospital
అపోలోలో గత రెండు నెలల కింద జయలలితకు ట్రీట్ మెంట్ జరుగుతున్న సమయంలో ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా విషమంగా మారింది. ఆ సమయంలో లండన్ నుంచి డాక్టర్ బాలే వచ్చారు. ఆయన వచ్చిన తర్వాతే జయ ఆరోగ్యం కుదుట పడింది. అయితే ఈ సమయంలోనే డాక్టర్ బాలేకు.. జయకు మధ్య చిన్న వాగ్వాదం జరిగిందని చెబుతున్నారు.

చికిత్సకు జయలలిత సహకరించకపోవడంతో రిచర్డ్ బాలే ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారట. అయినా ఒప్పుకోకపోవడంతో ఆయనలో సహనం నశించిందట. దీంతో ఒక్కసారిగా ఆయనకు ఆగ్రహం వచ్చేసిందట. నేను ఈ ఆస్పత్రికి బాస్ ను అని గట్టిగా చెప్పారట. అయితే ఐరన్ లేడీ అయిన జయ… తనకు గట్టిగా మాట్లాడే శక్తి లేకపోయినా డాక్టర్ కు రివర్స్ కౌంటర్ వేశారట. ఈ రాష్ట్రానికి మొత్తానికి నేనే బాస్ ను అని చెప్పారని తెలుస్తోంది.అంత నీరసంగా జయలో తగ్గని వాక్పటిమను చూసి రిచర్డ్ బాలే కూడా ఆశ్చర్యపోయారని సమాచారం. అందుకే ఆమెకు బతికించేందుకు ఆయన సర్వశక్తులు ఒడ్డారట. బాలే కృషి వల్లే మొదట జయ కోలుకున్నా.. ఆయన వెళ్లిపోయిన తర్వాత పరిస్థితి మారింది. జయ ఆరోగ్యం క్షీణించింది. తిరిగి బాలే వచ్చినా అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. అయితే బాలే మాత్రం తమ మధ్య గతంలో జరిగిన ఇన్సిండెంట్ ను గుర్తు చేసుకొని బాధపడ్డారట.

SHARE