అమ్మ ఆరోగ్యంపై ఏది నిజం?

Posted October 14, 2016

  jayalalitha fans two people suicide demand cm health
‘ అమ్మ కోలుకుంటున్నారు…పేపర్ కూడా చదువుతున్నారు’..ఇది అన్నాడీఎంకే వర్గాల మాట.అయితే లండన్ వైద్యులు పదేపదే ఎందుకు రావాల్సివస్తోంది?అంతా బాగుంటే ఆమెని ఎవరూ కలవకుండా ఎందుకు ఉంచాల్సివస్తోంది? ఇది సామాన్యుడి అనుమానం.ఓ వైపు అమ్మ కోలుకుంటున్నారని చెప్తున్నా ,అపోలో ఆస్పత్రి వర్గాలు రోజువారీ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నా సొంత పార్టీ కార్యకర్తలు కూడా అంతగా నమ్మడం లేదు.కాకపోతే వారు కోరుకునేది..జయ అంతరంగికులు బయటికి చెప్పేది ఒకటే మాట కావడంతో ఇప్పటిదాకా సమస్య తలెత్తలేదు.అయితే కాలం గడిచే కొద్దీ అన్నాడీఎంకే కార్యకర్తలు,సామాన్య తమిళుల్లో కూడా ఈ స్థాయి సహనం ఉండకపోవచ్చు.అప్పటిదాకా సమస్యని నానబెట్టడంకన్నా ఉన్నదున్నట్టు చెబితే మేలు.ఇప్పటికే ఆమె ఆరోగ్యం మీద వస్తున్న భిన్న వార్తలు ,ప్రచారాల మధ్య నలిగిపోయి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.ఇకపై ఇలాంటివి జరక్కుండా ఉండాలంటే జయ ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు వెల్లడించాలి లేదా ముఖ్యులనైనా ఆమెని కలిసే అవకాశం ఇవ్వాలని తమిళ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

SHARE