Posted [relativedate]
ఒకే విషయాన్ని ఎవరి కోణంలో వాళ్లే చూస్తారనడానికి తాజా ఉదాహరణ జయ వేలిముద్ర ఉదంతం.తమిళనాడు,మధురై జిల్లా,తిరుపారంగుండ్రం శాసనసభా స్థానానికి నవంబర్ 9 న ఉప ఎన్నిక జరగబోతోంది.అక్కడ అన్నాడీఎంకే అభ్యర్థిగా ఎస్.కె .బోస్ తలపడుతున్నారు.ఆయనకు పార్టీ ఇచ్చిన బీ ఫామ్ మీదున్న జయ వేలిముద్ర సంచలనం రేపుతోంది.ఆ బీ ఫామ్ విషయం బయటికి రాగానే అమ్మ కోలుకుందన్నారుగానీ ఇంకా సంతకం పెట్టలేకపోతున్నారా అని అన్నాడీఎంకే శ్రేణులు కాస్త డీలాపడ్డాయి.సహజంగా కుడి చేతి వేలి ముద్ర వేస్తారుగదా అన్న సందేహం కూడా మొదలైంది.కుడి చేయి పని చేయడం లేదా అని కూడా కొందరు అనుమానించారు.అయితే అందుకు సంబంధించి మద్రాస్ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి.బాలాజీ ఓ ధ్రువీకరణ చేశారు.జయకి వున్న అనారోగ్య పరిస్థితులు,జరుగుతున్న చికిత్స వల్ల ఆమె కుడి చేతి వేలిముద్ర తీసుకోవడం కష్టం కనుక ఎడమ చేతి వేలిముద్ర తీసుకున్నట్టు అయన సర్టిఫై చేశారు.
ఇన్ని సందేహాల్ని ముందే ఊహించిన జయ కోటరీ వాటిని నివృత్తి చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది.అయితే ఆమె ఎడమచేతి వేలిముద్ర తీసుకోవడం వల్ల తలెత్తే ఓ పరిణామాన్ని వాళ్ళు కూడా ఊహించి వుండరు.అదే జ్యోతిష్కుల గొడవ.సహజంగా మగవారికి కుడి చేయి, ఆడవారి ఎడమ చేయి చూసి జాతకం చెప్తారు హస్తసాముద్రికం లో పట్టునవాళ్లు.ఇప్పుడు జయ ఎడమ బొటన వేలి ముద్ర దొరగ్గానే హస్తసాముద్రిక పండితులు తమ భూతద్దాలకి పని పెట్టారు.ఆ ముద్రల్ని బట్టి ఆమె ఆరోగ్యం,భవిష్యత్ గురించి అంచనాలు,జోస్యాలు మొదలెట్టారు.ఇప్పటికైనా ఒప్పుకుంటారా ? ఒకే విషయాన్ని ఎవరి కోణంలో వాళ్ళే చూస్తారని..