జయ అప్పగింతలు..రాజకీయానికే తలవంపులు

0
1410

Posted [relativedate]

  jayalalitha giving ruling govt sheela balakrishnan cs rammohan
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి పాలై దాదాపు 15 రోజులైంది.ఆమెకి ప్రాణాపాయం తప్పిందని కాకపోతే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ 15 రోజులు,రానున్న ఒకటిరెండు నెలలు ప్రభుత్వ వర్గాలు ఎవరి మాట వినాలి?అందుకు సంబంధించిన బాధ్యతలు ఎవరికి అప్పజెప్పారు? ఈ ప్రశ్నలకి సమాధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ ఐఏఎస్ లే .ఒకరు ప్రస్తుత తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు ..మరొకరు జయకి సలహాదారుగా ఉన్న మాజీ ఐఏఎస్ షీలా బాలకృష్ణన్ .రామ్మోహన్ రావు తెలుగు వారైతే …ఉష కేరళకి చెందిన వారు.ఈ ఇద్దరి ఆదేశాలే ఇప్పుడు తమిళ మంత్రులు సైతం పాటిస్తున్నారు.వారి శక్తిసామర్ధ్యాలపై జయకి అపారనమ్మకం ఉండటం వల్లే వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించిఉండొచ్చు.

జయ …తన పరమభక్తుడు పన్నీర్ సెల్వం,అంతఃపుర వ్యవహారాలు చూస్తున్న శశికళని కూడా విశ్వాసంలోకి ఎందుకు తీసుకోలేదు?ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆమె అపనమ్మకం వ్యక్తుల మీద కాదు ..రాజకీయ వ్యవస్థ మీద.అందులో లోతుపాతులు,కుళ్లూకుతంత్రాలు మీద.అదే వ్యవస్థలో ఆమె పని చేస్తున్నా…ఆ వ్యవస్థ మీద కనీస నమ్మకం లేకపోయిందంటే రాజకీయాలు ఎంతగా భ్రష్టుపట్టాయో అర్థంచేసుకోవచ్చు.రాజకీయాల్లో విలువలు తగ్గిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోయినా జయ అప్పగింతలతో అది మరోసారి రుజువైంది.కానీ ఈ తలవంపులు కేవలం రాజకీయాలు,అందులో పని చేస్తున్న నేతలకు మాత్రమే కాదు.వారికి ఓటేసిన ఓటర్లకు ,మొత్తం ప్రజాస్వామ్యానికి కూడా.ఇది చేదుగా వున్నా కఠిన వాస్తవం.

Leave a Reply