Posted [relativedate]
18 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో వున్నారు జయలలిత..ఆమెని చూసేందుకు వస్తున్న వారికి ఎవరికీ జయని పరామర్శించే అవకాశం లేకుండాపోయింది.ఆ విషయంలో కేంద్ర మంత్రులైనా,జాతీయపార్టీ నాయకులైనా …సాక్షాత్తు ఆ రాష్ట్ర గవర్నర్ అయినా అపోలో లో అడుగు పెట్టాక జయ కోటరీ చెప్పినట్టే నడుచుకోవడం చూస్తున్నాం.బయటికొచ్చి వాళ్ళు చెప్పమన్నదే చెప్పడం వింటున్నాం .చివరకు జయ రక్త సంబంధీకులు కూడా ఆమెని కలవకుండానే వెనుతిరగాల్సి వచ్చింది.
ఒకప్పుడు ఇదే అనుభవం,అవమానం జయకి కూడా ఎదురైంది.1982 లోఅనారోగ్యంతో ఎం.జీ రామచంద్రన్ అనారోగ్యం పాలైనప్పుడు జయ ఆయన్ను చూడ్డానికి అపోలోకివెళ్లారు.ఆ టైం లో సీనియర్ నేతగా ఉన్న వీరప్పన్ వర్గం ఆమె సీఎం ని చూడకుండా అడ్డుకున్నారు.జపాన్ వైద్య బృందం ఆయనకి చికిత్స చేస్తున్నట్టు జయ ప్రెస్ నోట్ విడుదల చేయడాన్ని కూడా తప్పుబట్టారు.మళ్లీ 33 ఏళ్ల తరువాత అదే సీన్ రిపీట్ అవుతోంది.కాకపోతే ఇప్పుడు అక్కడ జయ చికిత్స పొందుతున్నారు.ఎంతో మంది ఆమెని చూడ్డానికి వచ్చి అవమానం పాలవుతున్నారు.