ఉత్సవాలకు జయ గ్రీన్ సిగ్నల్ ?.

Posted October 14, 2016

 jayalalitha green signals to anna dmk party 44 years celebrations
దాదాపు 20 రోజులుగా జయలలిత ఆస్పత్రిలో ఉండగానే అన్నాడీఎంకే శ్రేణులు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి.అందుకు ఆస్పత్రిలో ఉన్న జయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇంతకీ అంత ముఖ్యమైన సందర్భం ఏమిటంటే…ఈ నెల 17 కి అన్నాడీఎంకే ఏర్పడి 44 సంవత్సరాలు అవుతుంది.అందుకే పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని …mgr విగ్రహాలకు తమిళనాడంతా పూలమాలలు వేయాలని నిర్ణయించారు.ఈ ప్రతిపాదనకు జయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించాయి.దీంతో అమ్మ ఆరోగ్యం మెరుగుపడిందన్న వార్తలు నిజమేనని కింది స్థాయి కార్యకర్తలు అంటున్నారు.

SHARE