చిన్నమ్మకు పోటీగా అమ్మ!!

0
290
jayalalitha in competation with seshikala

Posted [relativedate]

jayalalitha in competation with seshikala
పురుచ్చితలైవి జయలలిత జీవితం ఓ సినిమాకు తక్కువేం కాదు. ఎన్నో మలుపులు. గెలుపోటములు..ఛీత్కారాలు-సన్మానాలు.. అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ అమ్మది. ఆమె మరణం తర్వాత రాంగోపాల్ వర్మ ఈ కాన్సెప్ట్ ఆధారంగా సినిమాను తీయడానికి ముందుకొచ్చారు. అయితే స్టోరీకి జయ నిచ్చెలి.. ప్రస్తుతం చిన్నమ్మగా చెలామణి అవుతున్న శశికళ పేరు పెట్టారు. ఆ పేరుతో రిజిస్టర్ కూడా చేశారు.

ఇప్పుడు జయ స్టోరీతోనే మరో సినిమా రాబోతున్నది. అయితే సినిమా డైరెక్టర్ మరెవరో కాదు దర్శకరత్న దాసరి నారాయణ రావు. అమ్మ అనే పేరుతో ఆమె సినిమా తీయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అమ్మ అనే టైటిల్ రిజిస్టర్ కూడా అయ్యింది.

జయలలితకు సంబంధించిన ఎన్నో విషయాలు వర్మ కంటే దాసరికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో వర్మ కంటే దాసరి సినిమా త్వరగా పట్టాలెక్కే ఛాన్సుందని సమాచారం. ఇప్పటికే ఆదిశగా స్ర్కిప్ట్ పనులు జరుగుతున్నాయట. ఎట్టి పరిస్థితుల్లో శశికళ కంటే ముందు అమ్మ సినిమాను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్.

ఒకవైపు శశికళ..! మరోవైపు అమ్మ…! రెండు టైటిల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒకవైపు వర్మ… మరోవైపు దాసరి.. ఇద్దరూ ఇద్దరే. ఇన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్న ఈ రెండు సినిమాల్లో ఏ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తారో వేచి చూడాలి.

Leave a Reply