“అమ్మ” లైఫ్ హిస్టరీ..

5844

Posted [relativedate]

jayalalitha life history
పురచ్చి తలైవి ..అమ్మ.. ఈ రెండు పదాల అర్ధం ఒకటే ఐనా తమిళనాట ఈ పదాలకి పర్యాయ పదం.. ముఖ్య మంత్రి జయలలితే…సుమారు రెండు నెలల పాటు పోరాడిన ఆమె సోమవారం అంతిమ శ్వాస కోసం పోరాడుతున్నారు .కేవలం ముఖ్య మంత్రి గానే కాకుండా వ్యక్తిగత జీవితం లోకూడా ఆమె ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొన్నారు…సహచర్య జీవితం వున్నా అంత ఆశా జనకం గా సాగ లేదు . ..బ్రాహ్మణ కుటుంబ నేపధ్యం అయినప్పటికీ …జీవితాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని జీవితంనుంచి నెగ్గుకొచ్చారు .క్లుప్తం గా ఆమె గురించి ….

  • జయలలిత …

Image result for jayalalitha life history

ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరురాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది.జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమెఅమ్మమ్మ పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించారు .రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినా ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది.

జానకి రామచంద్రన్ తరువాతజయలలిత తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.1991లో రాజీవ్ గాంధీమరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మేలో  జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందినది.2006 లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసన సభలో 1977 తరువాత అత్యంత పటిష్ఠమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు.

Related imageకుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ ఏ ట సినిమా రంగములో ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా కన్నడ లో ” చిన్నడ గొంబె కన్నడ “చిత్రము పెద్ద హిట్ .తెలుగులో ” మనుషులు మమతలు ” ఈమెను హీరోయిన్ గా ఉన్నతన స్థాయికి తీసుకెళ్లింది.

** కథానాయకుని కథ(1965)
**ఆమె ఎవరు? (1966)
**ఆస్తిపరులు (1966)
**కన్నెపిల్ల (1966)
**గూఢచారి 116(1966)
నవరాత్రి (1966)
గోపాలుడు భూపాలుడు (1967)ఇలా పలు చిత్రాల్లో కథానాయకి పాత్రను పోషించారు ..

1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి తో సత్కరించింది .అవివాహితగానే జయ జీవితాన్ని గడిపారు.జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతుంది.

  • రాజకీయ ప్రస్థానం

* 1988 లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది.
* 1989 గెలుపు,
* 1991 గెలుపు.
* 1996 లో జయలలితపై వచ్చిన కొన్ని అభియోగాలు కారణంగా ఓడిపోయిన ఆమె పార్టీ (1996 ఓటమి),
* (2001 గెలుపు)
* 2001 లో అత్యధిక మెజారిటీతో గెలిచింది.
* 2006 లో ఓటమి.
* 2011 లో ఏకపక్ష గెలుపు
* 2016 లో కూడా విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది .

jayalalitha cmతమిళ నాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ” ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కజగం  ” సాధారణ కార్యదర్శిఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ స్ఫూర్తి తో జయలలిత రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది..సెప్టెంబరు 27, 2014 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దైనది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది.మే 11, 2015న కర్ణాటక ఉన్నత న్యాయస్థానము ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. తమిళ రాజకీయ, సినీ రంగం లో తన దైన శైలిని సృష్టించిన ఘనత ఒక్క జయలలితకు మాత్రమే సాధ్యమైంది ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here