కొత్త పార్టీ దిశ‌గా అమ్మ‌ మేన‌కోడ‌లు

  Posted January 8, 2017
jayalalitha niece in new partyపురుచ్చిత‌లైవి జ‌య‌ల‌లిత మేనకోడ‌లు దీపా జ‌య‌కుమార్ రాజ‌కీయంగా యాక్టివ్ కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. పాలిటిక్స్ లోకి రావ‌డానికి ఇదే స‌రైన త‌రుణ‌మ‌ని ఆమె భావిస్తున్నారు. అందుకే ఆమె వేగం పెంచారు. శ‌శిక‌ళ‌ను దెబ్బ‌కొట్ట‌డమే ఏకైక ఎజెండాగా ఆమె అస్త్ర శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. 
ప్ర‌స్తుతం శ‌శిక‌ళ అన్నాడీఎంకేపై ప‌ట్టు సాధించారు. అయితే రోజురోజుకు ఆమెపై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ముఖ్యంగా కిందిస్థాయి నాయ‌కులెవ్వ‌రూ ఆమె నాయ‌క‌త్వాన్ని కోరుకోవ‌డం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు త‌ప్ప‌… క్యాడ‌ర్ ఆమెపై ఆగ్ర‌హంగా ఉన్నారు. అంతేకాదు ఆమెను చిన్న‌మ్మ‌గా పిల‌వ‌డం కూడా వారికి ఇష్టం లేద‌ట‌. అందుకే ఎక్కువ‌మంది ఇప్ప‌టికే జ‌య మేన‌కోడ‌లు దీపా జయ‌కుమార్ వైపు మొగ్గుచూపుతున్నార‌ట‌. గత కొన్ని రోజులుగా టీ.న‌గ‌ర్ లోని దీప నివాసానికి వ‌చ్చే అన్నాడీఎంకే శ్రేణుల సంఖ్య పెరుగుతుండ‌డమే అందుకు నిద‌ర్శ‌నం. 
అన్నాడీఎంకే అసంతృప్త వ‌ర్గం నుంచి త‌న‌కు మ‌ద్దతు పెరుగుతున్న నేప‌థ్యంలో దీప ఇప్పుడు ఏం చేయాల‌న్న‌ది ఆలోచిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం శ‌శిక‌ళ నుంచి అన్నాడీఎంకేను తీసుకోవ‌డం క‌ష్టం. కాబ‌ట్టి కొత్త పార్టీ దిశ‌గానే దీప అడుగులేస్తున్నార‌ని టాక్. అమ్మ సెంటిమెంటు క‌లిసి వ‌చ్చేలా కొత్త పార్టీ పేరు, సింబ‌ల్ కోసం ప్లాన్ జ‌రుగుతోంద‌ట‌. పురుచ్చిత‌లైవి లేదా జ‌య పేరుతో పార్టీ పేరు పెట్టాల‌ని దీప గ‌ట్టిగానే నిర్ణ‌యించుకున్నార‌ట‌. అందుకే త‌న ద‌గ్గ‌రకు వ‌చ్చే అన్నాడీఎంకే దిగువ‌స్థాయి నాయ‌కుల‌కు ఆమె కొద్ది రోజులు ఓపిక ప‌ట్టాల‌ని చెబుతున్నార‌ట‌. అన్నీ కుదిరితే ఈనెల‌లోపే పార్టీ పేరు ప్ర‌క‌టించ‌వ‌చ్చని స‌మాచారం. 
SHARE