జయ చిత్రం… పన్నీర్ విశ్వాసం

0
350
jayalalitha photo panneerselvam faith

 Posted [relativedate]

jayalalitha photo panneerselvam faith

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు విశ్వాసపాత్రుడైన ఆర్థిక మంత్రి ఓ.పన్నీర్‌సెల్వం నేతృత్వంలో బుధవారంనాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. గత నెల 22 నుంచి అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమెకున్న పోర్ట్‌పోలియోలన్నీ పన్నీర్‌సెల్వంకు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో జయలిత పరోక్షంలో తొలిసారి ఈ మంత్రివర్గ సమావేశం జరిగినప్పటికీ…ఆ లోటు లేకుండా పన్నీర్‌సెల్వం చూసుకున్నారు. తాను కూర్చున్న చైర్‌కు ముందు ‘జయమ్మ’ పెద్ద ఫోటోను ఉంచి మంత్రివర్గ సమావేశాన్ని కొనసాగించారు. ఆ విధంగా జయలలిత పట్ల తనకున్న ఆరాధనను చాటుకున్నారు.

32 మంది మంత్రులు పాల్గొన్న ఈ సమావేశం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై 10.30 వరకూ జరిగింది. కేబినెట్ భేటీలో ప్రధానంగా కావేరీ సమస్య ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈనెల 24తో కౌన్సిలర్లు, మేయర్ల పదవీ కాలం ముగుస్తున్నందున స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించిన అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు అధికారులు తెలిపారు. అలాగే గత సెప్టెంబర్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో ప్రభుత్వంతో కుదిరిన అవగాహనా ఒప్పందం ప్రకారం ఇన్వెస్టర్లకు భూముల కేటాయింపు అంశం సైతం సమావేశలో చర్చకు వచ్చింది. కాగా, అన్నాడీఎంకే గత మేలో అధికార పగ్గాలు చేపట్టన తర్వాత కేబినెట్ సమావేశం జరగడం ఇది మూడోసారి. మే 23న జయలలిత నేతృత్వంలో తొలి కేబినెట్ సమావేశం జరుగగా, రాష్ట్ర బడ్జెట్‌కు ముందు గత జూలైలో రెండో సమావేశం జరిగింది.

Leave a Reply