జయ వీలునామా…ఆ హీరోనే వారసుడా?

0
755
jayalalitha proposal ajith cm candidate tamilnadu

Posted [relativedate]

ajith-kumar-will-be-jayalaithas-party-leaderతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన వారసుడి గురించి ముందే వీలునామా రాశారా? ఇప్పుడు ఆ రాష్ట్రమంతటా ఇదే చర్చ. తన అనారోగ్యం గురించి ఆమెకి అవగాహన ఉందని అందుకే ముందస్తు జాగ్రత్త తీసుకున్నారని అన్నాడీఎంకే వర్గాల నుంచి వస్తున్న సమాచారం. జయ వీలునామా లో ఉన్న పేరు హీరో అజిత్ అని పక్కాగా తెలుస్తోంది. వీలునామా రాయడానికి ముందే అజిత్ వ్యక్తిత్వాన్ని,గుణగణాల్ని జయ అన్ని కోణాల నుంచి అంచనా వేశారని కూడా పోయెస్ గార్డెన్స్ వర్గాలు చెబుతున్నాయి. వీలునామా రాయడానికి ముందే అజిత్ ని పిలిపించుకుని జయ మనసులోమాట చెప్పారట. అన్నాడీఎంకేలో పరిస్థితుల్ని ఆయనకి క్షుణ్ణంగా వివరించారట. ప్రత్యర్థుల వ్యూహాల గురించి కూడా అజిత్ కి పాఠాలుగా బోధించారట.

జయ రాసిన వీలునామా ఇప్పటికే చేరాల్సిన వాళ్ళ దగ్గరికి చేరిందట. దాన్ని ఎప్పుడు ఎలా బయటపెట్టాలో కూడా జయ సదరు వ్యక్తులకి వివరించి చెప్పారట. జయని అమ్మగా భావించే అజిత్ ఆమెకి అంతగా నచ్చడానికి కారణాలు కూడా ఆ వీలునామాలో ప్రస్తావించారట. అజిత్ నిరాడంబరత, వ్యక్తిగత జీవితంలో పాటించే విలువలు జయని అమితంగా ఆకట్టుకున్నాయట. అతను చేసే గుప్తదానాల గురించి కూడా కూపీ లాగిన మీదటే జయ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో పన్నీర్ సెల్వం సహా ఏ నాయకుడిని ఎంపిక చేసినా అంతర్గత కలహాలు వస్తాయని జయ భావించారట. ఇక డీఎంకే లాంటి బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే ప్రజాకర్షణ కూడా అవసరమని జయ ఆలోచించారట.

ఇంత మేధోమధనం జరిగాకే జయ తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అజిత్ పూర్వాశ్రమం కూడా కొంత భిన్నమే. తండ్రి తమిళ్ బ్రాహ్మిణ్, తల్లి బెంగాలీ. తండ్రి ఉద్యోగరీత్యా అజిత్ సికింద్రాబాద్ లోనే పుట్టి పెరిగాడు. కేవలం 10 వ తరగతి చదివాడు. తరువాత కొన్నాళ్ళు మెకానిక్ గా పని….ఆపై సినీ రంగ ప్రవేశం.తెలుగులో ప్రేమపుస్తకం సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా రిలీజ్ కి ముందే తమిళ్ అవకాశాలు రావడంతో అటు వెళ్లారు. ఆ తరువాత విషయాలు అందరికీ తెలిసిందే..

Leave a Reply