Posted [relativedate]
18 రోజులుగా ఆస్పత్రిలో పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి సంతకం ఫోర్జరీ అయిందా?ఆ సంతకాన్ని అడ్డం పెట్టుకుని అన్నాడీఎంకే కి ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీ ని నియమించబోతున్నారా? అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది?ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతుంటే అనూహ్య కారణాలు బయటపడుతున్నాయి. జయ వారసుడిగా అజిత్ పేరు ప్రకటిస్తూ ఆమె వీలునామా రాసినట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..ఈ విషయం నచ్చని ఆమె సన్నిహితురాలు శశికళ ఓ ఫోర్జరీ సంతకంతో పార్టీ భాధ్యతల్ని తన మనిషిని నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.ఇటీవల ఓ డీఎంకే ఎంపీతో అసభ్యంగా ఫొటోల్లో దర్శనమిచ్చి అన్నాడీఎంకే నుంచి గెంటివేయబడ్డ శశికళ పుష్ప ఈ డౌట్ వ్యక్తపరిచారు.అదే విషయంతో గవర్నర్ విద్యాసాగరరావు కి ఓ లేఖ కూడా రాశారు.
రాహుల్ గాంధీ అంత వాళ్ళొచ్చినా జయని కలవకుండా చేయడం మీద కూడా శశికళ పుష్ప అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇకపై జయ సంతకంతో వచ్చే లేఖల్ని జాగ్రత్తగా పరిశీలించాలని ఆమె గవర్నర్ ని కోరారు .అంతకు ముందు సుబ్రహ్మణ్యం స్వామి సైతం శశికళ భర్త నటరాజన్ ని సీఎం చేయాలని కుట్ర జరుగుతున్నట్టు ఆరోపించారు.ఓ వైపు జయ ఆరోగ్యం మెరుగు అవుతుందని వార్తలు వస్తుండగానే ఇప్పుడొస్తున్న అనుమానాలతో అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.