జ‌య వార‌సుడు అత‌డేనా?

Posted March 19, 2017

jayalalitha son is fake
జ‌య‌ల‌లిత‌- శోభన్ బాబుకు పెళ్లి జ‌రిగిందా? ఇద్ద‌రికీ ఒక కొడుకు ఉన్నాడా? ఇద్ద‌రూ క‌లిసి ఆ బిడ్డ‌ను వేరేవారికి ద‌త్తత ఇచ్చారా? సోష‌ల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.

చెన్నైకి చెందిన కృష్ణ‌మూర్తి అనే వ్య‌క్తి తాను జ‌య‌లలిత కుమారుడిన‌ని చెబుతున్నారు. అంతేకాదు ఇటీవ‌ల ఈ విష‌యంలో కోర్టును ఆశ్ర‌యించారు. అమ్మ ఆస్తుల‌న్నీ త‌న‌కే చెందుతాయ‌న్న‌ది ఆయ‌న వాద‌న‌. ఆ పిటిష‌న్ ను స్వీక‌రించిన న్యాయ‌స్థానం అందుకు త‌గ్గ ప‌త్రాల‌ను చెన్నై పోలీసు క‌మిష‌న‌ర్ కు ఇవ్వాల‌ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో కృష్ణ‌మూర్తి ఉద్దేశ్య‌పూర్వ‌కంగా అందుకు సంబంధించిన ప‌త్రాల‌ను బ‌య‌ట‌పెట్టారో.. లేక మ‌రెవ‌రైనా కావాల‌ని పెట్టారో తెలియ‌దు కానీ కృష్ణ‌మూర్తికి సంబంధించిన ద‌త్త‌త ద‌స్తావేజులు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఆ ద‌స్తావేజుల ప్ర‌కారం.. జ‌య‌ల‌లిత హీరో శోభ‌న్ బాబును ప్రేమించారు. 1982 లో ఇద్ద‌రూ వివాహం చేసుకున్నారు. 1985 లో జ‌య .. ఒక మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. అయితే అదే స‌మ‌యంలో ఎంజీఆర్ .. జ‌య‌ను చూసేందుకు ఇంటికి వ‌చ్చి పోతుండ‌డంతో… ఇద్ద‌రు దంప‌తుల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ట‌. వీడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారట‌. అయితే ఇద్ద‌రికీ పుట్టిన కుమారుడిని జ‌య త‌న స్నేహితురాలైన వ‌సంతామ‌ణికి ద‌త్త‌త ఇచ్చార‌ట‌. స్వ‌యంగా జ‌య‌ల‌లిత రాసి ఇచ్చిన‌ట్టు ఆ ద‌స్తావేజుల్లో ఉంది.

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న ఈ ద‌స్తావేజుల్లో వాస్త‌వం లేక‌పోవ‌చ్చ‌న్న వాద‌నే ఎక్కువ వినిపిస్తోంది. ఎందుకంటే తాను జ‌య కుమారుడిని అని చెబుతున్న కృష్ణ‌మూర్తికి… జ‌య పోలిక‌లు.. కానీ శోభ‌న్ బాబు పోలిక‌లు కానీ లేవు. ముఖ క‌వ‌ళిక‌ల్లోనూ తేడా ఉంది. కాబ‌ట్టి ఈ ద‌స్తావేజులు కూడా ఫేక్ అయి ఉండొచ్చ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే కృష్ణ‌మూర్తి కోర్టు ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌దు. ఇక ముందు మ‌రెవ‌రూ తామే అస‌లైన వార‌సులమంటూ అంత ఈజీగా కోర్టుకెక్కే అవ‌కాశం ఉండ‌దు!!

SHARE